వామ్మో.. ప్రభాస్ సినిమాలలోకి రాకపోయినా రాజకుమారుడైనా.. ఈయన ఆస్తి ఎంతో తెలుసా?

రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హీరో గా పేరు సంపాదించుకున్నారు. ఈ విధంగా ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇలా ఒక్కో సినిమాకి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే ప్రభాస్ పెద్దఎత్తున ఆస్తులను సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తారు.

నిజం చెప్పాలంటే ప్రభాస్ సినిమాలలోకి రాకపోయినా రాజకుమారుడు అని చెప్పాలి. ఈయన సినిమాలలోకి రాకముందు పెద్దఎత్తున వీరికి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు తన పెద నాన్న కృష్ణంరాజు కలిసి సొంత బ్యానర్ నిర్మించారు. ఈ బ్యానర్ లో ఎన్నో సినిమాలను నిర్మించి మంచి ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. ఈ విధంగా సూర్యనారాయణరాజు అప్పట్లోనే బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి ప్రాంతాలలో భారీ ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారు. అదేవిధంగా కొబ్బరి తోటలు వ్యవసాయ భూములు భారీగానే సంపాదించి పెట్టారు.

ఇలా ప్రభాస్ ఇండస్ట్రీలోకి రాకముందే ఆయన ఎన్నో కోట్లకు వారసుడు అని చెప్పాలి. ఇక ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొంది ఒక్కో సినిమాకు వందల కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ప్రభాస్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ ముంబై వంటి ప్రాంతాలలో ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేశారు. ఇలా ప్రభాస్ ఆస్తులన్నీ కలుపుకుంటే సుమారు 10వేల కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. నిజంగా ప్రభాస్ రాజకుమారుడని చెప్పవచ్చు.