Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Jr Ntr: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో లలో రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పటివరకు ఎన్టీఆర్ 29 సినిమాలు చేశాడు. అందులో దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు.

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటూ భారీగా సంపాదించాడు. ఒక సినిమాకు 20 కోట్ల దాకా రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఎన్టీఆర్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అన్న విషయం తెలుసుకోవాలి అనీ అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఎన్టీఆర్ కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హైదరాబాదులో ఎన్టీఆర్ కు 50 కోట్ల విలువ గల ఒక ఇల్లు ఉంది. అలాగే ఫోర్ట్స్ 911 గల ఒక కారు కూడా ఉంది. ఆ కారు ధర కోటిన్నరకు పైమాటే. అలాగే రెండు కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కూడా ఉంది.

వీటితో పాటుగా లక్షలు విలువ చేసే ఖరీదైన వాచ్ లు కూడా ఉన్నాయి. ఇటివలే ఎన్టీఆర్ ఒక కారును కొన్నాడు.. ఆ కారు ధర దాదాపుగా కోటి 20 లక్షలు ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ వద్ద బివిఎల్ గరి బై రిట్రో సెర్మక్ అనే ఏడు లక్షల 12 వేలు విలువచేసే వాచ్ కూడా ఉంది. అలాగే ఐదు లక్షలు విలువ చేసే మరొక వాచ్ కూడా ఉంది. వీటితో పాటుగా ఎన్టీఆర్ పలు యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక్కొక్క యాడ్ కు దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.