Dhanush In Kuberaa: కుబేర సినిమాకు ధనుష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారో మీకు తెలుసా?

Dhanush In Kuberaa: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు హీరో ధనుష్. తెలుగులో కూడా ధనుష్ కి భారీగా అభిమానులు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ధనుష్. ప్రస్తుతం తమిళంతోపాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఇప్పటికే గత సినిమా సార్ తో తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేశారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. హీరో నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో ధనుష్ ఇది వరకు ఎప్పుడూ నటించని విధంగా బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించమపించారు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ముఖ్యంగా ధనుష్ నటనను చూసి ప్రేక్షకులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా ఈ మూవీని దాదాపుగా రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ధనుష్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాకు ధనుష్ రూ.30 కోట్లు పారితోషికం అందుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు ధనుష్. ఆ తర్వాత అక్కినేని నాగార్జునకు రూ.20 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా హిట్లతో ఫుల్ జోష్ మీదున్న రష్మిక కుబేర చిత్రానికిగానూ రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కాగా హీరో ధనుష్ రెమ్యూనరేషన్ తెలిసి షాక్ అవుతున్నారు.