Big Boss Non Stop: బుల్లితెరపై ప్రసారమౌతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.మరొక రోజుతో 10 వారాలు పూర్తి చేసుకోనున్న ఈ కార్యక్రమం త్వరలోనే గ్రాండ్ ఫినాలే నిర్వహించనుంది.ఇకపోతే ఈ కార్యక్రమం చివరి దశకు రావడంతో తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ రెమ్యునరేషన్ గురించి చర్చనీయాంశంగా మారింది.
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు మంచిగా రెమ్యూనరేషన్ అందుతుంది. అయితే నాన్ స్టాప్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లలో అనిల్ రాథోడ్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అనిల్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఆయన ఎక్కువ రోజులు ఉండరని చాలా మంది భావించారు. అయితే అనిల్ ఎంతో కూల్ గా గేమ్ ఆడుతూ పది వారాల పాటు హౌస్ లో కొనసాగుతూ వచ్చారు.
ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఆటతీరును కనబరుస్తున్న అనిల్ బిగ్ బాస్ హౌస్ లో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈయన ఒక్కో వారానికి కేవలం లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టువంటి అనిల్ ఎక్కువ వారాలపాటు హౌస్లో కొనసాగడంతో ఈయనకు బిగ్ బాస్ నుంచి మంచి లాభమే ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ వారం నామినేషన్ లో భాగంగా ఇద్దరు మాస్టర్ లు మినహా మిగిలిన వారందరూ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.