Karthika Deepam – Monitha: కార్తీక దీపం సీరియల్ లో దీపను ఎంత ప్రేమిస్తారో, మోనితను అంతే ద్వేషిస్తారు. ఆ సీరియల్ లో విలన్ రోల్ లో కనిపిస్తున్న మోనిత అసలు పేరు శోభా శెట్టి. బెంగళూర్ లో జన్మించిన ఈమె ఎమ్మెస్సీ వరకు చదువుకుంది. తన తాతయ్యకు నటన అంటే చాలా ఇష్టం ఉండేదని, తన తాతయ్య ద్వారానే యాక్టింగ్ నేర్చుకున్నా అని మోనిత తెలిపింది. చిన్నతనంలోనే భరత నాట్యం చేస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది మోనిత.
అంతే కాకుండా మోనిత వల్ల తాతయ్యకు ఒక డ్రామా కంపెనీ ఉండేది. అందుకే ఆమె యాక్టింగ్ నేర్చుకోవడం సులువైందని ఆమె తెలిపింది. మోనిత కార్తీక దీపం సీరియల్ లో మాత్రమే కాకుండా అగ్ని సాక్షి లాంటి సీరియల్స్ తో పాటు తెలుగులో లాహిరి లాహిరి లాహిరిలో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సీరియల్స్ లో ఈమె నటించింది. డిగ్రీ చదివేటప్పటి నుంచే సీరియల్స్ లో నటిస్తూ, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగుతుంది మోనిత.
మోనిత తన ఇంట్లో నాలుగో సంతానం. ప్రారంభంలో తన కుటుంబ సభ్యులే ఆమెకు యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పించే వారట. అలా మొదటగా కన్నడ సీరియల్ ఒక లీడ్ రోల్ అవకాశం వచ్చింది. అక్కడ అది బాగా హిట్ అవ్వడంతో కార్తీక దీపం సీరియల్ కి ఎంపిక చేశారట.
ఇకపోతే కార్తీక దీపం సీరియల్ లో విలన్ క్యారక్టర్ చేయడానికి ముందు ఇష్టం లేకపోయినా ఆ తర్వాత తన ఇంటి సభ్యుల కోరిక మేరకు ఓకె చెప్పిందట మోనిత. మొదట్లో ఆ క్యారక్టర్ చూసి తనకు చాలా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని, ఆ తర్వాత వాళ్ళు తన నిజ క్యారక్టర్ తెలుసుకొని అందరూ తనను అభిమానిస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మోనిత అగ్ని సాక్షి సీరియల్ లో చేస్తున్నప్పుడే కన్నడలో అంజనీ పుత్ర సినిమాలో అవకాశం వచ్చింది. అందులో హీరోయిన్ గా మోనిత చేస్తే, పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేశారు. ఈ సినిమా 70 రోజుల్లోనే 50 కోట్లను వసూలు చేసింది. ఇకపోతే 2019లో కార్తీక దీపం సీరియల్ కి గానూ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ కూడా అందుకున్నారు మోనిత.