Tollywood: చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ స్టార్ హీరోలకు మించిన ఆస్తి.. తండ్రి ఒక స్టార్ కమెడియన్!

Tollywood: ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరో సినీ నేపథ్యం కుటుంబం కావడంతో ఇండస్ట్రీలోకి త్వరగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే ఏకంగా స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన సినిమాలో నటించారు. సినిమా విడుదల కాకముందే పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కానీ కట్ చేస్తే సినిమా విడుదల అయ్యి ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టు లేక పోయింది. ఈ సినిమాకు అనుకూనంత రెస్పాన్స్ రాలేదు. అయినప్పటికీ నిరాశ పడకుండా ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మెప్పించాడు. సినిమాలు సక్సెస్ కాకపోయినప్పటికీ హీరోగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా తన కెరీర్ మొత్తం మహా అంటే ఒక ఐదు సినిమాలు మాత్రమే చేసి ఉంటాడు.

ఇక హీరోగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు పూర్తిగా విరామం చేశారు. అయితే చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే అయినప్పటికీ ఆస్తుల విషయంలో మాత్రం స్టార్ హీరోలకు మించి ఉన్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? ఆయన తండ్రి ఎవరు అన్న విషయానికి వస్తే.. అతను మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ రాజా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలలో నటించి స్టార్ కమెడియన్ గా తనకంటూ చరగని ముద్రను వేసుకున్నారు బ్రహ్మానందం. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక తండ్రి బ్రహ్మానందం అడుగుజాడల్లోనే నడుస్తూ గౌతమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదు అనిపించుకుంది.

ఆ తర్వాత వారెవా, బసంతి,చారుశీల మను లాంటి సినిమాలలో నటించి మెప్పించారు. ఈ సినిమాలేవి కూడా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దాంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన గౌతమ్ రాజా బిజినెస్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గౌతమ్ కి చాలా రకాల బిజినెస్ లు ఉండడంతో పాటు ముఖ్యంగా హైదరాబాదులో కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పదుల సంఖ్యలో పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఉన్నాయట. వీటన్నింటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీ కంపెనీలలో పెట్టుబడిగా పెడుతూ నెలకు దాదాపుగా 30 కోట్ల వరకు అర్జిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారంగా చూసుకుంటే సంవత్సరానికి దాదాపుగా 360 కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడట గౌతమ్ రాజా. ఇది టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోకీ మించిన సంపాదన అని చెప్పాలి. ఇలా బిజినెస్ రంగంలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోలను మంచి సంపాదించినట్టు తెలుస్తోంది.