Nerves weekness: మానవ శరీరంలో ఈ నాడీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ నాడీ వ్యవస్థ సంకేతాల ప్రసారానికి ముఖ్య బాధ్యతను వ్యహిస్తుంది. అంతేకాకుండా ఈ నాడీ వ్యవస్థ శరీరానికి చాలా అవసరమన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ఈ నాడీ వ్యవస్థలో నరాల బలహీనతకు గల కారణం, నరాలకు తగిలే గాయాలు, కుష్టు వ్యాధి ఇంకా మధుమేహ వ్యాధిగ్రస్తులలోనూ ఈ నరాల బలహీనతను చూడటం జరుగుతుంది. ఈ నరాల బలహీనత కాన్సర్ వంటి వ్యాధిగ్రస్తులలో కూడా చూడవచ్చును.
నరాల బలహీనత లక్షణాలు ఏమై ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…
ముఖ్యంగా నరాల యందు నొప్పి, తిమ్మిర్లు, కండరాల బలహీనత, అలసట, అనుభూతి జ్ఞానాన్ని కోల్పోవడం లాంటివి జరుగుతుంటాయి. కొన్నిసార్లు మానసిక పరిస్థితిని కూడా అదుపు చేసుకోలేరు, అదేవిధంగా పనిపై శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించి సలహాలను తీసుకోవడం మంచిది.
ఈ నరాల బలహీనతను తేలిక పాటి వ్యాయములు, యోగాలు చేయడం వల్ల నరముల ఉదృతిని శాంతింప చేసేందుకు ఇవి ఉపయోగపడుతాయి. దీని కారణంగా నరాల బలహీనత నందు వచ్చు నొప్పిని తగ్గించుకోవచ్చను. ఇంకా ఆకుపచ్చని కూరలు, విటమిన్ డి వంటివి కూడ ఉపయోగపడతాయి. ఇలా మన శరీరానికి కావలసిన విటమిన్లు పోషకాలు సమృద్ధిగా తీసుకుంటూ సరైన వ్యాయామాలు చేయడం వల్ల నరాల బలహీనత సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.