Devotional Tips: కుంకుమ నేలపై పడితే అశుభంగా భావిస్తున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పసుపు కుంకుమను మనం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పసుపు కుంకుమలు ముత్తయిదువులు మరింత గౌరవంగా భావించడం వల్ల వీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్నిసార్లు పొరపాటున చేయి జారి పసుపు కుంకుమ కింద పడుతుంది. ఇలా కుంకుమ కింద పడినప్పుడు మనసు మొత్తం కీడు శంకిస్తోంది. ఏదైనా చెడు జరుగుతోందా అందుకే ఇది సంకేతమా అంటూ చాలామంది ఖంగారు పడుతుంటారు.అయితే కుంకుమ నేలపై పడితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు,లేదా ఏదైనా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగితే తప్పనిసరిగా అశుభం కలుగుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు నిజానికి అలా బయలుదేరే సమయంలో లేదా పూజా కార్యక్రమాలలో కుంకుమ కింద పడితే శుభసూచకమని పండితులు చెబుతున్నారు.

నేల అంటే సాక్షాత్తు భూదేవి. భూదేవి కూడా సర్వ సుమంగళి కనుక ఏదైనా శుభకార్యం జరుగుతున్న సమయంలో ముత్తైదు కుంకుమ తనకు కూడా కావాలని కోరుతుంది అందుకే కొన్ని సమయాలలో ఇలా పసుపుకుంకుమ నేలపై పడుతుంది.అలా పడటం వల్ల సాక్షాత్తు భూదేవి కూడా పసుపు కుంకుమ మనం సమర్పించినట్లు అని అర్థం. అంతేకానీ ఇదొక చెడు సంకేతం అయితే కాదని పండితులు చెబుతున్నారు.