Apple Side Effects: పండ్లు , కూరగాయలు ఆకుకూరలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ముఖ్యంగా ప్రతి రోజు ఒక ఆపిల్ పండు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అందువల్ల రోజుకో ఆపిల్ తినటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరమే ఉండదు అంటుంటారు. అనారోగ్యం బారిన పడినప్పుడు ఆపిల్స్ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడే అనేక రకాల పోషకాలు ఆపిల్స్ లో పుష్కలంగా ఉంటాయి.విటమిన్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.కానీ యాపిల్స్ మరీ ఎక్కువగా తింటే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.
ఏ ఆహార పదార్థం ఐన సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా మోతాదుకు మించి తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యాపిల్స్ కూడ రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం చేయవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని రోజుకి 4,5 యాపిల్స్ తింటే చాలా ప్రమాదం. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలో 70 గ్రాముల కన్న ఎక్కువ ఫైబర్ ఉంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం , మలబద్దకం వంటి ఉదర సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.
యాపిల్స్ ఎక్కువగా తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువయ్యే ప్రమాదం ఉంది. యాపిల్స్ లో ఆమ్ల పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అధిక బరువు సమస్య ఉన్నవారు బరువు తగ్గటానికి ఆహారం తినకుండా పండ్లు ఎక్కువగా తింటుంటారు. ఇలా యాపిల్స్ ఎక్కువ తినటం వల్ల అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించకుండా ఇంకా ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంది.
పొరపాటున యాపిల్స్ తో పాటు వాటి విత్తనాలు తినటం వల్ల కూడా చాలా ప్రమాదం. యాపిల్స్ తినే సమయంలో వాటి విత్తనాలు తినటం వల్ల తలనొప్పి, కడుపు నొప్పి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రోజుకి ఒకటి లేదా రెండు యాపిల్స్ తినటం ఆరోగ్యానికి మంచిదనీ డాక్టర్లు సూచిస్తున్నారు.