Coconut: దేవుడికి సమర్పించే కొబ్బరికాయకు బొట్టు పెట్టకూడదా.. పెడితే ఏమవుతుంది?

Coconut: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజ కార్యక్రమం జరిగినా లేదా శుభకార్యం జరిగినా కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇలా కొబ్బరికాయ కొట్టి కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తాము అలాగే వారు చేసే కార్యములో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ఉండాలని కొబ్బరికాయ కొడతారు. ఇలా కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే చాలామంది కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తారు.

ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టే టప్పుడు చాలామంది కొబ్బరికాయకు బొట్టు పెట్టి కొడతారు. ఇలా పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయకు ఈ విధంగా కుంకుమ పెట్టి కొట్టడం వల్ల అష్ట దరిద్రాలు మన వెంటే వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు. అయితే కొబ్బరికాయకు ఎందుకు బొట్టు పెట్టకూడదు అనే విషయానికి వస్తే…

దేవుడికి మనం మన స్ఫూర్తితో సమర్పించే కొబ్బరికాయకు ఎలాంటి బొట్లు పెట్టకూడదు. కేవలం ఎవరికైనా దిష్టి తీసే సమయంలో,లేదా కొత్త వాహనాలను కొనుగోలు చేసి ఆ వాహనాలకు దిష్టి తీసే కొబ్బరికాయకు, అదేవిధంగా ఏదైనా తీర్థయాత్రలకి ప్రయాణిస్తున్న సమయంలో వాహనాలకు కొట్టే టెంకాయలకు మాత్రమే బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టాలి కానీ మన స్ఫూర్తితో భక్తితో దేవుడికి సమర్పించే కొబ్బరికాయకు కుంకుమ పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.