స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ పనులు చేయకండి… చేస్తే అంతే సంగతులు?

సాధారణంగా చాలామంది ఇంటిలో పరిశుభ్రత పాటించడం కోసం ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా ఇంటిని శుభ్రం చేసినప్పటికీ చాలామంది బాత్రూం విషయంలో అలసత్వం వహిస్తారు. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే అనేక ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాత్రూం పరిశుభ్రత విషయంలో కూడా కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ఎంతో ముఖ్యం.

చాలామంది స్నానం చేసిన తర్వాత కొన్ని పనులను చేస్తుంటారు. అయితే స్నానం చేసిన తర్వాత కొన్ని రకాల పనులను చేయకపోవడం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పనులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిన నీటిని ఉంచకూడదు. ఆ నీటిని ఇతరులు స్నానం చేయటం వల్ల వారికి ఎంతో శుభం కలుగుతుంది. అలాగే స్నానానంతరం బకెట్ ఖాళీగా ఉంచకూడదు. మంచినీళ్లు పట్టి పెట్టాలి లేదంటే బకెట్ ను బోర్ల ఉంచాలి. ఇక చాలా మంది మహిళలు తల స్నానం చేసిన వెంటనే నుదుటిపై సిందూరం పెట్టుకుంటారు. తడి జుట్టుతో నుదుటిపై సిందూరం పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వల్ల వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కలుగుతాయి.

స్నానం అనంతరం ఎలాంటి పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. ముఖ్యంగా స్త్రీలు వెంటనే వంట చేయడానికి వెళ్ళకూడదు. స్నానం చేసిన తర్వాత బాత్రూంలో నీటుగా నీళ్ళుపోసి శుభ్రం చేయాలి. లేదంటే చెడు గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది.ఇక చాలామంది స్నానం చేసిన తర్వాత తడి బట్టలను బాత్రూంలో ఉంచి వస్తారు పొరపాటున కూడా ఈ తప్పు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.