అమ్మో..’డిజె టిల్లు’ భామ!!

అమ్మో..’డిజె టిల్లు’ భామ మామూలుది కాదు. బాగానే తెలివైంది సుమా! ఇప్పుడు టాలీవుడ్ లో ఎవ్వరి నోటా విన్నా ఇదే మాట వినిపిస్తోంది. కృతి శెట్టి, శ్రీనిధి శెట్టి, రష్మిక మందన్న ఇలా కన్నడ బ్యూటీలుతెలుగులో మంచి విజయాలు అందుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకే చేరింది .’డిజె టిల్లు’ బ్యూటీనేహా శెట్టి. కన్నడ చిత్ర సీమలో ఇప్పుడు శెట్టి అంటే చాలు అందరికి ‘కాంతారా’ గుర్తుకు వచ్చేస్తోంది. ఎందుకంటే శెట్టిల ప్రభావం అలా వుంది మరి! ఇప్పుడు అక్కడ పరిశ్రమలో. అది అలా ఉంచితే కన్నడ నటీమణులు ఒక్కొక్కరు తెలుగు చలన చిత్ర సీమలో మంచి ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ‘డి జె టిల్లు’లో హీరోయిన్ గా చేసిన నేహా శెట్టికి ఆ సినిమా మంచి విజయం సాధించటం తో అందరి కళ్ళు ఆమె మీద వున్నాయి. తన తదుపరి సినిమా ఏంటా అని అందరూ అనుకుంటూ ఉండగానే, కార్తికేయ పక్కన ఒక మంచి రోల్ కొట్టేసింది ఈ కన్నడ అమ్మాయి. ఈమధ్య సాంఘీక మాధ్యమాల్లో కూడా బాగా అలికిడి చేస్తూ, విరివిగా ఫొటోస్ చూపిస్తోంది. ఆమె పోస్ట్ చేసిన తాజా ఫోటోస్ చూస్తే, ఆమె ఎంత గ్లామరస్ గా ఉందొ ఇట్టే మీకే అర్థమవుతోంది.