ఏంటి ఆ దేశంలో రిలీజ్ కాబోతున్న డిజాస్టర్ “ఆచార్య”..పోస్టర్ చూసారా?

Acharya

Acharya : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఈ సినిమా ఈ ఏడాది లోనే కాకుండా తెలుగు సినిమా దగ్గర ఒక భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా ఇప్పుడు ఓటిటి లో కూడా వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా మరో దేశంలో విడుదల అవుతుందట. ఇంత డిజాస్టర్ అయ్యిన సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందా అనుకుంటున్నారా? అదే జపాన్ లో అట. అయితే అక్కడ రామ్ చరణ్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది.

కానీ ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. అయితే దీనిపై కొన్ని పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అందులో అయితే ఈ మే 15 నుంచే డేట్ ఉంది. మరి అక్కడి రిలీజ్ పై మాత్రం ఇంకాఆ సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.