Director Teja : ఎంతో మంది కొత్త ఆర్టిస్టులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ తేజది. కొత్త ఆర్టిస్టులతోనే ఆయన సినిమాలు తెరకెక్కిస్తారనే ప్రచారం కూడా గట్టిగా వుంది ఆయనపై. అయితే, ఆయన పరిచయం చేసిన హీరోలూ, హీరోయిన్లు వెండితెరపై స్టార్స్‌గా వెలిగిపోతారనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు.
అయితే, షూటింగ్ సమయాల్లో తేజ కాస్త కఠినంగా వ్యవహరిస్తారనీ, అవసరమైతే చేతి వాటం కూడా ప్రదర్శిస్తారనే ప్రచారం వుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో తేజ చాలా కఠినంగా వ్యవహరిస్తారట. ఆయన పరిచయం చేసిన పలువురు హీరోయిన్లపై ఆయన చేయి చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంటుంది.
కానీ, ఆ ముద్దుగుమ్మలు మాత్రం డైరెక్టర్ తేజ చాలా పాజిటివ్‌గా వుంటారనీ, తెలియని విషయాలు జాగ్రత్తగా తెలియచెబుతారనీ అంటారు. కానీ, ఆయన డైరెక్షన్‌లో వర్క్ చేసిన అనిత, సదా, రక్షిత, ఆఖరికి కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లు అప్పుడప్పుడూ చెంప దెబ్బలు తిన్నారనీ తేజ సన్నిహితులు చెబుతున్న మాట.
చందమామ కాజల్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తుంది. హీరోయిన్ రక్షిత..’ అవును నిజమే, కోపమొస్తే ఆయన్ని అస్సలు తట్టుకోలేం. చాలా భయమేస్తుంది..’ అంటూ పరోక్షంగా ఆయన వల్ల బాధపడిన అనుభవం వున్నట్టే చెప్పుకొచ్చింది.
అలాగే, ‘నువ్వు నేను’ ఫేమ్ అనితకు తేజ చేతిలో చెంపదెబ్బల సన్మానం జరగడం నిజమేనని ప్రత్యక్ష సాక్ష్యులు కొందరు చెబుతారు. కానీ, అనిత కూడా ఈ విషయంలో ఎప్పుడూ బయటపడలేదు సుమీ.