Star Director: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్‌ డైరెక్టర్‌ కొడుకు!

Star Director: తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు.. దాదాపు అన్ని సినీ పరిశ్రమలలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణం. హీరోల వారసులతోపాటు హీరోయిన్ల వారసులు అలాగే దర్శకులు, నిర్మాతల వారసులు కూడా నటులుగా ఇతర టెక్నీషియన్లుగా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉన్నారు.

దర్శకుడు తేజ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన “ఈగిల్ ఐ సినీ స్టూడియో”

ఇప్పుడు మరో దర్శకుడి కుమారుడు హీరోగా మారేందుకు రంగం సిద్ధమైంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎన్నో యూత్‌ ఫుల్‌ సినిమాలు డైరెక్ట్‌ చేసి ప్రస్తుతానికి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు తేజ (Director Teja). తేజ తన కొడుకు అమితోవ్‌ తేజను (Amitov Teja) హీరోగా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు.

ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. నవంబర్‌ లేదా డిసెంబర్‌ నుండి షూట్‌ కి వెళ్లొచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దర్శకుడు తేజ (Director Teja) గతంలో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేశారు. చివరిగా ‘నేనే రాజు నేనే మంత్రి ‘అనే సినిమాతో హిట్‌ అందుకున్న ఆయన దగ్గుబాటి సురేష్‌ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా ‘అహింస’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద మాత్రమే కాదు.. విమర్శకుల దగ్గర కూడా దారుణమైన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే తేజ (Director Teja) కుమారుడి సినిమాకి తేజనే దర్శకత్వం వహించబోతున్నారు అని తెలుస్తోంది. అయితే నిర్మాత ఎవరు? అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. తేజ (Director Teja) స్వయంగా సినిమా నిర్మిస్తారా? లేక బయట నిర్మాత ఎవరైనా సినిమా అని నిర్మిస్తారా? అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Analyst Dasari Vignan about Duvvada Srinivas and Madhuri Biopic Movie | Duvvada Madhuri Marriage |TR