Aditi Shankar: డైరెక్టర్ శంకర్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన పాన్ ఇండియాలో విడుదల కానుంది. అయితే సంక్రాంతి బరిలో పెద్దపెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలో కూడా ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో పెద్ద సినిమాలు లేకపోవడంతో గేంజెడ్ సినిమాకు కాస్త కలిసి రానుంది. కానీ తమిళంలో మాత్రం చిన్న చిన్న సినిమాలు పోటీకి ఉన్నాయి. వాటిల్లో నెసిప్పాయ అనే సినిమా కూడా ఉంది.గేమ్ ఛేంజర్ సినిమాని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతికి తమిళ్ లో రిలీజ్ కాబోయే నెసిప్పాయ సినిమాలో శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. దీంతో తండ్రి సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తుందని తమిళ మీడియాలు అంటున్నాయి. ఇంతకీ ఈ నెసిప్పాయ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్ పంజా సినిమాని డైరెక్ట్ చేసిన విష్ణువర్ధన్ ఈ నెసిప్పాయ సినిమాని డైరెక్ట్ చేసారు. ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా ఈ సినిమాని నిర్మించారు. అయితే దీనిపై అదితి ప్రమోషన్స్ లో మాట్లాడుతూ..
మా నాన్నకు నేను పోటీ కాదు. ఆయన సినిమాతో పాటు మా సినిమా కూడా వస్తుంది అని తెలిపింది అదితి శంకర్. మరి తండ్రి, కూతురు వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి. అయితే కేవలం శంకర్ వర్సెస్ అదితి మాత్రమే కాదండోయ్ ఈ సంక్రాంతికి తమిళ్ లో రామ్ చరణ్ వర్సెస్ నిహారిక కూడా పోటీ ఉంది. నిహారిక హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా మద్రాస్ కారన్ కూడా జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజే రిలీజ్ కానుంది. మరి తమిళ్ లో గేమ్ ఛేంజర్ కి పోటీగా వచ్చే చిన్న సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి మరి.