Director Samudra: హీరో కృష్ణ గారి కొడుకు మహేశ్ సినిమాకు సంబంధించి నిన్నటి నుంచి షూటింగ్ మొదలైందని, డైరెక్షన్‌కు ట్రై చేస్తున్నావ్ కదా… మహేష్‌కు పరిచయం చేస్తాను రమ్మని అప్పటికే మంచి స్నేహితుడిగా ఉన్న ప్రకాష్ రాజ్ తనతో చెప్పినట్టు తెలిపారు డైరెక్టర్ సముద్ర. అలా చెప్పగానే తాను పద్మాలయ స్టూడియోస్‌కి వెళ్లానని, అక్కడ అప్పటికే ఉన్న ప్రకాష్ రాజ్ తనను పిలిచి, మహేష్.. నా ఫ్రెండ్ వీడు సముద్ర.. వీలైతే డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వు, కథ విను అనగానే ఆయన కూడా ఓకే అన్నా వింటాను అని, రెండు రోజులు కాగానే మనం కలుద్దాం సర్ అని మహేష్ బాబు తనతో అన్నట్టు సముద్ర తెలిపారు. అలా తనకు మహేశ్ బాబు పరిచయం అవ్వడం, కథ చెప్పడం, వెంటనే ఆయనక్కూడా నచ్చడం అలా జరిగిపోయానని ఆయన చెప్పారు.
ఇకపోతే ఇదంతా కూడా మహేశ్ హీరో అయిన మూడో రోజే జరిగిందని సముద్ర అన్నారు. అలా ఆయన్ని కలవడం, ఆయనకు తాను చెప్పిన కథ కూడా నచ్చడంతో కచ్చితంగా ఈ ప్రాజెక్టు మనం చేద్దామని అనడం చూస్తుండాగనే జరిగాయని ఆయన తెలిపారు. ఇక ప్రొడ్యూసర్స్ సూపర్ గుడ్ ఫిలింస్ అనుకున్నామని, కొంచెం కఠినంగా వ్యవహరించినా మంచి క్రమశిక్షణ ఉంటుందని సూపర్ గుడ్ ఫిలింస్‌ను ఎన్నుకున్నామని ఆయన చెప్పారు.
అప్పట్లో కొన్ని రిమేక్ సినిమాలు చేద్దామను చౌదరిగారు, మహేశ్‌ను అడిగినపుడు రిమేక్ ఎందుకు సర్, మన కథలు మనం చేసుకుందామని అన్నట్టు ఆయన తెలిపారు. వీళ్లేమో అది ఓవర్ బడ్జెట్ అవుతుందని అనేవారని ఆయన చెప్పారు. ఇలా దాదాపు 6ఏళ్లు గడిచిపోయాయని, మంచి ప్రొడ్యూసర్ చూసుకోండి సర్ చేద్దామని మహేశ్ అనేవాడని ఆయన అన్నారు. ఈ లోపు తనకు సింహరాశి అవకాశం వచ్చిందని చెప్పగానే మహేశ్ కూడా దానికి సపోర్ట్ చేసి, పర్లేదు చేయండి అని అన్నారని ఆయన చెప్పారు. ఆ సినిమా హిట్ కావడంతో మహేశ్ నుంచి తాను అప్రిసియేషన్ కూడా అందుకున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.