Prashanth Neel : ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు సుమీ.!

Prashanth Neel : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ, దూసుకెళుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్లు వారి వారి గొప్పతనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయ్.

కేజీఎఫ్ సినిమాకి పని చేసిన సినిమాటోగ్రఫర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ‘ఉగ్రమ్’ అనే ఓ చిన్న సినిమాకి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేసిన భువన్ గౌడను ‘కేజీఎఫ్’ వంటి ఓ పెద్ద విజువల్ వండర్ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా పని చేసే అవకాశమిచ్చాడు ప్రశాంత్ నీల్. బ్యాక్ గ్రౌండ్ పరంగానూ చాలా చాలా పూర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈయన.

ఇక ఎడిటర్ విషయానికి వస్తే, ఉజ్వల్ కులకర్ణి. ఈయన కూడా పేదింటి అబ్బాయే. చాలా చిన్న వయసులోనే ఇంత పెద్ద సినిమాకి ఎడిటర్‌గా పని చేసే అవకాశం వచ్చిందంటే అదంతా ప్రశాంత్ నీత్ పుణ్యమే. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చాడు. కరోనా లాక్డౌన్  టైమ్‌లో ఆయన తన తండ్రి కార్ఖానాలో పని చేశాడు.

ఇదంతా వారి వారి రియల్ లైఫ్ స్టోరీలు. ఇక ‘కేజీఎఫ్’ హీరో విషయానికి వస్తే, యష్ కూడా ఏమంత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వున్నోడు కాదు. సినిమాలో హీరో పాత్రనీ చిన్న స్థాయి నుంచి వచ్చి ఓ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకునే వ్యక్తిగా చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

తన చుట్టూ వున్న పరిస్థితుల్ని, సమాజాన్నిఇన్సిప్రేషన్‌గా తీసుకుని తన సినిమాలోని ఆయా పాత్రలను రూపొందించాడు. ఆ పాత్రల ఎలివేషన్ అందుకేనేమో అంతలా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది.

అందుకే ప్రశాంత్ నీల్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ఓ మంచి విజన్ వున్న సాధారణ వ్యక్తి కూడా. ఆ వ్యక్తిత్వమే ఆయనను సక్సెస్‌ఫుల్ స్థానంలో నిలబెట్టిందేమో.