Kalki 2898 AD: టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అలాగే దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి పాన్ ఇండియన్ సెలబ్రిటీలు కీలకపాత్రల్లో నటించారు. హిందూ ఇతిహాసం దశావతారలోని చివరి అవతారమైన కల్కి అవతారం ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించారు నాగ్ అశ్విన్. ఇందులో విజయ్ దేవరకొండ అర్జునుడిగా, ప్రభాస్ కర్ణుడిగా కనిపించారు. మహాభారతంలోని సందర్భానుసార సన్నివేశాలు ఈ చిత్రంలో చూపించిన విషయం తేలిసిందే.
ఇక చివరగా కృష్ణావతారం తెరపై చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. కానీ కృష్ణ పాత్రలో ఎవరు నటించారు అనేది సస్పెన్స్ క్రియేట్ చేశారు డైరెక్టర్. ఈ భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 ఉందని ఇప్పటికే మూవీ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించింది ఎవరు అన్నది మాత్రం తెలియలేదు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో అభిమానులు నేటిజన్స్ సెర్చ్ చేయగా సూరరై పోట్రు సినిమాలో సూర్య స్నేహితుడిగా నటించిన బాలసుబ్రమణ్యం ఇందులో కృష్ణుడు పాత్రలో నటించిన తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రెండో భాగంలో కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించినట్లుగా ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. పార్ట్ 1లో కృష్ణ పాత్ర చాలా సేపు కనిపించడం లేదని, అందుకే అతని ముఖం స్పష్టంగా కనిపించలేదని, ఆ పాత్రను ఎక్కువ కాలం చూపించాల్సిన పరిస్థితి ఉంటే తప్పకుండా నటుడు మహేష్ నటించేలా చేస్తాను అని అన్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే దాదాపు రూ.600 కోట్లతో రూపొందిన ఈ కల్కి మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. త్వరలో సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రం 2024లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 2వ సినిమాగా నిలిచింది.