Lakshmi Sowjanya: డైరెక్టర్ తేజకి తిక్క…ఏం కొడతారా అని అడిగా… డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య!

Lakshmi Sowjanya: తాను మొదటగా డైరెక్టర్ తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరానని దర్శకురాలు లక్ష్మీ సౌజన్య అన్నారు. అంతకంటే ముందు తాను గవర్నమెంట్ కోసం ఒక అడ్వర్‌టైస్‌మెంట్ చేశానని ఆమె చెప్పారు. దాని వల్ల తనకు మంచి పేరు కూడా వచ్చిందని ఆమె తెలిపారు. అప్పట్లో ఫిమెల్ పర్సన్స్ డైరెక్ట్ చేయడమనేది చాలా రేర్‌గా ఉండేదని, అదీ కాక కండోమ్ యాడ్ అనేది ఒక ఫిమేల్ చేయడమనేది ఇంకా అరుదైన విషయమని ఆమె వివరించారు.

ఇక వివరాల్లోకి వెళ్లితే డైరెక్టర్‌ తేజ గారి దగ్గర పని చేయడం తనకు మంచి అనుభవాన్నిచ్చిందని ఆమె చెప్పారు. కాకపోతే వర్క్ విషయంలో ఆయన కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారని ఆమె అన్నారు. వచ్చిన కొత్తలోనే ఆయన తనను ఇంటర్వ్యూ చేశారని ఆమె చెప్పారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారని, అదేంటంటే నాకు చాలా తిక్క అని అన్నారని, దానికి తాను సమాధానంగా అయితే పని చేసినా కూడా కొడతారా, ఒక వేళ పని చేసినా కూడా కొడతారు అంటే అప్పుడు తిక్క అని అంటాము అని, పని చేయకపోతే కొడితే తప్పేం కాదని, తాను మాత్రం పని చేయగలను, ఉండగలనని చెప్పినట్టు లక్ష్మీ తెలిపారు. అది విని అయితే జాయిన్ అవమని తేజ చెప్పినట్టు ఆమె చెప్పారు.

ఆ తర్వాత తాను అన్ని పనులూ చూసుకునే స్థాయికి చేరుకున్నానని, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీ ఫాలో కావడం, ఆర్టిస్ట్‌లకు ప్లేస్‌మెంట్ ఇవ్వడం లాంటి పనులన్నీ చేసేదాన్నని ఆమె చెప్పారు. తేజ గారు తనను ఆ తర్వాత బాగా మెచ్చుకున్నారని ఆమె వివరించారు. అక్కడ ఉండగానే శేఖర కమ్ముల గారు పిలిచారని ఆమె చెప్పారు. ఆ తర్వాత కృష్ణ వంశీ గారు పిలిచారని, తమకు నచ్చితే ఉంచుకుంటామని చెప్పారని ఆమె అన్నారు. కానీ ఇప్పుడు అడిగితే మాత్రం ఆయనకు తాను అభిమాని అని, తాను ఏమైనా నేర్చుకున్నది అంటే అది ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నదే అని ఆమె స్పష్టం చేశారు.