శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్.. ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా 2002 లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, సినిమా ఎమోషన్.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికి టీవీల్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లలో ఈ సినిమాని వేస్తారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్ అందించాడు.
ఇలాంటి మంచి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. హీరో రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న మళ్లీ విడుదల చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ మూవీస్ వారు ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. దేశభక్తి ఇతి వృత్తంగా వచ్చిన ఎన్నో చిత్రాల్లో ఖడ్గం సినిమాకు ప్రేత్యేక్ష స్థానం ఉంది.
జనరేషన్స్ మారినా పేట్రియేటిక్ సినిమాల్లో అన్నిటిలో ఖడ్గం గొప్ప సినిమా. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి తీసారు దర్శకుడు కృష్ణవంశీ. మధు మురళీ నిర్మించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్.. హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించే కుర్రాడిగా రవితేజ.. ముస్లిం యువకుడిగా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.