Kuberaa: కుబేరకు తమిళంలో భారీ షాక్.. అయోమయంలో మూవీ మేకర్స్.. నష్టం తప్పేలా లేదుగా!

Kuberaa: తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.. తమిళం తో పాటు తెలుగులో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు హీరో ధనుష్. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి కూడా విడుదల అయ్యాయి. తెలుగు సినిమాలు కూడా తమిళంలోకి విడుదల అయ్యాయి. ఇకపోతే ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చివరి సినిమా రాయన్ దాదాపుగా 150 కోట్లకు పైగా వసూలను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు విడుదలైన సార్,తిరుచిత్రాంబలం సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ సాధించాయి.

కానీ ధనుష్ నటించిన తెలుగు మూవీ మాత్రం తమిళంలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లలో రాబట్ట లేకపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటించగా నాగార్జున కీలకపాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు తెలుగులో సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది. కానీ తమిళంలో పరిస్థితి మరోలా ఉంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా జరిగాయి. విడుదల అయిన తర్వాత మంచి టాక్ వస్తే సినిమా పుంజుకుంటుందని కలెక్షన్లు కూడా బాగానే వస్తాయనే మూవీ మేకర్స్ భావించారు.

కోరుకున్నట్లే పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ రివ్యూయర్లందరూ సినిమాను కొనియాడారు. ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీస్‌ లో ఒకటని కుబేర సినిమాను అభివర్ణించారు. మొదటి రోజు వసూళ్లు ఆశాజనకంగానే కనిపించాయి. కానీ ఓవరాల్‌ గా వీకెండ్ లో ఒక మోస్తారు వసూళ్లతో సరిపెట్టుకుందీ ఈ చిత్రం. వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా పడిపోయాయి. ప్రస్తుతానికి వసూళ్లు రూ.20 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఫుల్ రన్లోనూ రూ.25 కోట్లకు మించి రాబట్టే అవకాశం కనిపించడం లేదు. ఈ సినిమాకు తమిళంలో జరిగిన బిజినెస్సే తక్కువ. రూ.18 కోట్ల తక్కువ మొత్తానికి హక్కులు అమ్మారు. వసూళ్లు చూస్తుంటే 40-50 శాతం మధ్య నష్టాలు తప్పేట్లు లేవు. తమిళంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పట్ల డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. కుబేర కథ, ధనుష్ పాత్ర తమిళ సెన్సిబిలిటీస్‌ కు తగ్గట్లుగా ఉంటాయి. ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలను అక్కడి వాళ్లు బాగా ఆదరిస్తారు. వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా ఇది. అయినా ఈ సినిమాకు వసూళ్లు తక్కువ రావడం ఏంటో అర్థం కావడం లేదు. అసలిలా ఎందుకు అయిందో, ఎక్కడ తప్పు జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల.