ప్రస్తుతం నాగచైతన్య సమంత పేర్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినబడుతున్నాయి.వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైతన్య అభిమానులు సమంత పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా చైతన్య అభిమానులు కాస్త హద్దుమీరి సమంతను వేశ్య అంటూ కామెంట్లు చేయడం దారుణం అని చెప్పాలి. అదే విధంగా నాగచైతన్య నటించిన శోభిత ధూళిపాళతో డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై చైతన్య అభిమానులు స్పందిస్తూ చైతన్య పై పగ తీర్చుకోవడం కోసమే అతనిని చెడ్డ చేయడం కోసమే సమంత ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తుంది అంటూ చైతన్య అభిమానులు సమంతను దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఇక ఈ వార్తలపై స్పందించిన సమంత తనదైన శైలిలో సమాధానం చెబుతూ అబ్బాయిలు ఎదగండి మీరు మీ పనులపై దృష్టి పెట్టండి అంటూ కామెంట్ చేశారు. తాజాగా సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు.
నిన్నటితరం దర్శకుడిగా పేరు పొందిన గీతాకృష్ణ ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కపోయినా ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పెద్దఎత్తున సెలబ్రిటీల గురించి కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య గురించి మాట్లాడుతూ వీరిద్దరికీ ఎంతో కెరియర్ ఉంది అలాంటి సమయంలో వీరు పెళ్లి చేసుకున్నప్పుడే వీరిద్దరూ విడిపోతారని అనుకున్నా అంటూ కామెంట్ చేశారు.సమంత ఎంతో ఫ్రీడమ్ ఉన్న అమ్మాయి అలాంటి అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక సాధారణ గృహిణిగా ఇంటిపట్టున ఉండాలంటే కష్టం. అదేవిధంగా ఇండస్ట్రీలో ఉంటూ గ్లామర్ షో చేయడం సౌత్ ప్రేక్షకులు స్వాగతించరు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఈయన హీరోయిన్ తో డేటింగ్ లో ఉంటే తప్పేముంది?అయితే నాగచైతన్య మరోసారి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో డేటింగ్ చేయడం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి అంటూ గీతాకృష్ణ వెల్లడించారు.