Baghavanth Kesari: తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు చేసిన ఈయన అన్ని సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అపజయం ఎరుగని దర్శకుడు జాబితాలో అనిల్ రావిపూడి కూడా ఉన్నారు. ఇక ఇటీవల ఈయన బాలకృష్ణతో కలిసి చేసిన భగవంత్ కేసరి సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులలో భాగంగా ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు రావడంతో హీరో బాలకృష్ణ కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా చాలా గర్వంగా ఉందని ఇలాంటి అవార్డులు మాకు మరింత స్ఫూర్తిని కలిగిస్తాయని తెలిపారు. ఇక మా సినిమాకు నేషనల్ అవార్డు రావడం అంటే ఆ క్రెడిట్ మొత్తం చిత్ర బృందానిదే అంటూ బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఈ అవార్డుపై స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తన సినిమాకు జాతీయ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ చేయాలని తనకు కూడా ఉందని.. సరైన టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా భగవంత్ కేసరి 2 చేస్తానని తెలిపారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తారని పేర్కొన్నారు. ఇలా ఈ సినిమాకు సీక్వెల్ సినిమా రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
