Bollywood: షాకింగ్ న్యూస్.. ప్రముఖ నటికి క్యాన్సర్.. టెన్నిస్ బాల్ సైజులో కణితి.. ట్వీట్ వైరల్!

Bollywood: బాలీవుడ్ ప్రముఖ టీవీ నటి దీపికా కక్కర్ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన అభిమానులతో ఒక విచారకరమైన వార్తను పంచుకుంది. హిందీలో సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బిగ్బాస్ సీజన్ 12 విజేతగా నిలిచి మరింత పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్వించే దీపిక తాజాగా ఒకసారిగా షాకింగ్ న్యూస్ చెప్పడంతో అభిమానులు బాధని వ్యక్తం చేస్తూ ఆమె కోలుకోవాలని చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందో ఆ మాటల్లోనే మనం తెలుసుకుందాం.. గత కొన్ని వారాలు నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా ఉన్నాయి. నాకు చాలా రోజులుగా నా పొత్తి కడుపు పై భాగంలో నొప్పిగా ఉంది. దీంతో మేము ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాను. అక్కడ నా కాలేయంలో టెన్నిస్ బంతి పరిమాణంలో కణితి ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఇది స్టేజ్ 2 క్యాన్సర్‌ గా నిర్ధారణ అయ్యింది. అయితే నేను ఇప్పటికే చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాను. అయినా నేను ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నాను. క్యాన్సర్ మహమ్మారిని పూర్తి ధైర్యంతో ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే దీని నుంచి కోలుకుంటానని భావిస్తున్నాను.

 

ఈ క్లిష్ట సమయంలో నా కుటుంబం మొత్తం నాకు తోడుగా నిలిచింది. అలాగే మీ ప్రేమాభిమానాలు, ప్రార్థనలు కూడా మాతో ఉన్నాయి. దయచేసి నాకోసం ప్రార్థించండి అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ రాసుకొచ్చింది దీపిక. ప్రస్తుతం దీపిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దీపిక పోస్టుకు స్పందిస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. మీకేం కాదు మేడం మీరు బాగుంటారు త్వరగా కోలుకుంటారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. తాము ఎంతగానో ఇష్టపడే నటికీ ఇంత కష్టం వచ్చిందా అంటూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.