ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ విలన్ భార్య.. ఎవరో గుర్తుపట్టారా!

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి చిన్ననాటి ఫొటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక సెలబ్రిటీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఈమె నటిగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఒక స్టార్ విలన్ భార్యగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. ఈమె తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈమె భర్త కూడా తాజాగా అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..

అదేనండి పుష్ప సినిమా ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో ఫాహాధ్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ .రాజా రాణి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితమైన ఈమె ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమెకు ఎన్నో తెలుగు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అవకాశాలను వదులుకున్నారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ నాని సరసన అంటే సుందరానికి అనే తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈమె తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ముద్దుగా బొద్దుగా తెల్లటి ఫ్రాక్స్ గురించి ఉన్న నజ్రియా నజీమ్ చిన్న వయసులోనే అందరిని ఆకర్షించేలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె నటించిన సుందరానికి సినిమా జూన్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.