అమరావతి చుట్టూ నారాయణ మాయాజాలం బట్టబయలయ్యేనా.?

TDP Narayana

TDP Narayana

టీడీపీ అధికారంలో వున్నప్పుడు రాజధాని అమరావతి వ్యవహారంలో అన్నీ తానే అయి వ్యవహరించారు నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ. పార్టీలో సీనియర్ నేతలు సైతం, ఆయన తీరుతో విసిగిపోయారు. ఉప ముఖ్యమంత్రి అయినాసరే, సీనియర్ పొలిటీషియన్ అయినాసరే.. నారాయణని పలు అంశాల్లో బతిమాలుకోవాల్సి వచ్చేది.. తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా.

టీడీపీ ప్రభుత్వంలో నారాయణ అంటే నెంబర్ టూ.. అనే భావన అప్పట్లో గట్టిగా వినిపించేది. మరి, అంత పేరు ప్రఖ్యాతులు, పవర్ అప్పనంగా పొందిన నారాయణ, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత రాజకీయాల్లో మరింత యాక్టివ్‌గా వుండాలి కదా.? కానీ, అమరావతి కుంభకోణం ఎక్కడ తన మీద వచ్చి పడుతుందోనన్న భయంతో సైలెంటయిపోయారని నారాయణ గురించి చాలామంది అంటుంటారు. ఆయన అలా తప్పించుకోవాలని చూసినా, చివరికి సీఐడీ ఉచ్చులో నారాయణ చిక్కకోక తప్పలేదు. నారాయణ ఇళ్ళు కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈ విషయమై నోటీసులు కూడా జారీ చేశారు సీఐడీ అధికారులు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, అమరావతి చుట్టూ ఎంత రచ్చ జరిగినా, నారాయణ పెద్దగా స్పందించలేదు.

టీడీపీ తరఫున వాయిస్ కూడా బలంగా వినిపించలేదు. ఎందుకు.? అంటే, అదంతే. వైసీపీలోకి వెళ్ళాలని నారాయణ ప్రయత్నించినా, అందుకు అక్కడి పరిస్థితులు అనకూలించలేదట. మరోపక్క, నారాయణ గనుక పార్టీ మారితే, అమరావతి గుట్టు బయటపడిపోతుందని చంద్రబాబు కూడా, నారాయణను వారిస్తూ వచ్చారన్నది రాజకీయ వర్గాల్లో విన్పిస్తోన్న మరో గాసిప్. మాయల పకీరు ప్రాణం చిలకలో వున్నట్టు, ఇప్పుడు ఈ అమరావతి కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు భవిష్యత్తు నారాయణ చేతిలో వుందనుకోవాలేమో. నారాయణ అప్రూవర్ అయితే, చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్లేననే ప్రచారం జరుగుతోంది.