Vastu Tips: బయటకు వెళ్ళేటప్పుడు కుక్క ఎదురుగా వచ్చిందా… దేనికి సంకేతమో తెలుసా?

Vastu Tips: సాధారణంగా మన భారతీయులు ఎన్నో విషయాలను విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఏదైనా ప్రయాణ సమయంలో కొంతమంది ఎదురు వస్తే మంచి జరుగుతుందని, అలాగే మరికొంత మంది మనుషులు లేదా జంతువులు ఎదురొచ్చినా ఆ శుభం జరుగుతుందని నమ్ముతుంటారు. ముఖ్యంగా ఎవరైనా బయటకు వెళ్లేటప్పుడు తుమ్మడం, ఏడవడం, లేదా పిల్లి ఎదురొస్తే అశుభం అని భావిస్తారు.మరి మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఎదురుగా కుక్క వస్తే ఏం జరుగుతుంది కుక్క ఎదురు రావడం దేనికి సంకేతం అనే విషయాలను తెలుసుకుందాం…

మన హిందూ పురాణాల ప్రకారం కాలభైరవుడుగా భావిస్తాము. అయితే కొన్ని సందర్భాల్లో కుక్కను శుభసూచకంగా పరిగణించే మరికొన్ని సందర్భాలలో పరిగణిస్తాము. మన ఇంటి ముందు కుక్క ఉండి గట్టిగా తల పైకెత్తి అరుస్తూ ఉంటే మనలో తెలియని ఆందోళన కలుగుతుంది. కుక్క ఇలా అరుస్తూ ఉంటే ఆ ఇంటిలో ఏదో ప్రమాదం జరుగుతుందని సంకేతం. అలాగే మనం ఏదైనా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్న సమయంలో కుక్క లేచి చెవులు విదిలించి వెళితే శుభం జరుగుతుందని భావిస్తారు.

అదేవిధంగా మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేసే సమయంలో కుక్క వళ్ళు విరుచుకుని ఎదురుగా వస్తే మనం వెళ్లే ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడతాయని అర్థం.అలాగే ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు కుక్క ఆ వ్యక్తిని చూసి గట్టిగా అరిస్తే ఆ వ్యక్తి పనిలో ఆటంకం కలుగుతుంది. ఇలా కుక్క కొన్ని విషయాలలో శుభంగా పరిగణిస్తారు మరికొన్ని విషయాలలో ఆశుభంగా భావిస్తారు. అయితే కుక్కను కాలభైరవుడితో సమానంగా భావిస్తాము కనుక దానిని కొట్టకుండా వీలైనంత వరకు కుక్కకు సేవ చేయడం మంచిది.