సినిమా ఇండస్ట్రీ లో అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకప్పుడు స్టార్స్ గా ఒక్క వెలుగు వెలిగిన వాళ్లు దీనస్థితికి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాగయ్య, రాజనాల, కాంత రావు, పద్నానాభం లాంటి వాళ్లు చివరి రోజుల్లో చాలా కష్టాలు అనుభవించారు. ఎన్టీఆర్, నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి నటులు మాత్రం పక్క ప్లానింగ్ తో తమ వారసులకు కూడా సంపాదించి పెట్టారు.
ఇండస్ట్రీ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన సావిత్రి, కొన్ని కారణాల కారణంగా మద్యానికి బానిస అయ్యి, దీన స్థితిలో చనిపోయింది. అలాగే ఒకప్పటి నటి, డాన్సర్, సిల్క్ స్మిత కూడా చివరి రోజుల్లో చాలా బాధను అనుభవించి ఆత్మ హత్య చేసుకుంది.
తన కెరీర్ పీక్స్ లో ఉండగా ఓ హీరోతో ప్రేమ విఫలమవడం, కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవడంతో సిల్క్ స్మిత డిప్రెషన్లోకి వెళ్ళింది. అప్పట్లో సిల్క్ స్మిత మరణం ఒక షాక్. అయితే స్మిత తన చివర ఉత్తరంలో ఇలా రాసుకుంది.
“దేవుడా నా 7వ సంవత్సరం నుండి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మినవారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరూ నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుంటుంబానికి నా కుటుంబాని పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా.. అతడు నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. ఒకప్పుడు నేను నగలు కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు.
ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండను. నాకు ఒకడు 5సంవ్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను.” అంటూ సిల్క్ ఎంతో బాధతో ఉత్తరం రాసింది.
సిల్క్ స్మిత జీవితాన్ని బేస్ చేసుకుని బాలీవుడ్ “డర్టీ పిక్చర్” అనే ఒక సినిమా వచ్చింది. విద్య బాలన్ సిల్క్ స్మిత రోల్ లో నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.