బీజేపీ విషయంలో బాధపడిపోతున్న పవన్.. చేజేతులా నాశనం చేసుకున్నాడు

pawan kalyan janasena

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య తీసుకున్న రెండు నిర్ణయాలు వలన బంగారం లాంటి అవకాశాలను చేజేతులా వదులుకున్నాడు అనే చెప్పాలి. బీజేపీ పార్టీతో పొత్తు తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, అయితే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటించలేదు, పొత్తు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ తో కలిసి ముందుకు వెళ్లాల్సి ఉన్నకాని జనసేనాని ఎందుకో వెనకడుగు వేశాడు, దాని మూల్యం ఇప్పుడు చెల్లించుకున్నాడు పవన్.

pawan kalyan janasena

 దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుందని అందరు అనుకున్నారు, అందుకు తగ్గ రూట్ మ్యాప్ కూడా సిద్దం అవుతుందని పుకార్లు వచ్చాయి, కానీ ఏమి జరిగిందో ఏమో కానీ పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉన్నాడు. కట్ చేస్తే ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెరాస మీద విజయం సాధించింది. దుబ్బాకలో కాషాయ దళం కనీస పోటీ ఇస్తుందని అనుకున్నారు కానీ విజయం సాదిస్తుందని అనుకోలేదు. ఆ ఒక్క విజయం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చివేశాయని చెప్పవచ్చు, దుబ్బాకలో పవన్ ప్రచారం చెయ్యకపోవటంతో అలాంటి అద్భుతమైన చారిత్రక గెలుపులో భాగం కాలేకపోయాడు.

 ఇక గ్రేటర్ మొదటి జనసేన పార్టీ పోటీచేయడానికి సిద్ద పడింది, కానీ బీజేపీ తో చర్చలు ముగిసిన తర్వాత ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో జనసైనికులు బీజేపీ కి మద్దతు ఇవ్వాలని చెప్పాడు, కానీ పవన్ కళ్యాణ్ తన స్థాయికి తగ్గ మద్దతు ఇవ్వలేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తాడని, కేసీఆర్ కు చుక్కలు చూపించే ప్రచారం చేస్తాడని అందరు అనుకున్నారు, కానీ జనసేనాని మాత్రం మెల్లగా గ్రేటర్ ఫైట్ నుండి తప్పుకున్నాడు. కట్ చేస్తే GHMC పరిధిలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాలుగు డజన్ల సీట్లు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తే ఆ విజయంలో మెజారిటీ వాటా తీసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రచారానికి దూరంగా ఉండటంతో బీజేపీ విజయాన్ని జీర్ణించుకోవటం పవన్ కు కొంచం కష్టంగా మారిపోయింది.

 అటు దుబ్బాక లో, ఇటు గ్రేటర్ పరిధిలో వచ్చిన రెండు అవకాశాలను పవన్ కళ్యాణ్ చేజేతులా వదులుకొని ఇప్పుడు బాధపడితే లాభం లేదు. అయితే సీఎం కేసీఆర్ కు భయపడే పవన్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నాడని , ఇవే ఎన్నికలు ఆంధ్రాలో జరిగితే ఆవేశంతో ఊగిపోతూ ప్రచారం చేసేవాడని, ఇక్కడ తెలంగాణ లో చూస్తూ చూస్తూ కేసీఆర్ తో పెట్టుకోవటం ఎందుకనే ఉద్దేశ్యంతోనే జనసేనాని దూరంగా ఉన్నాడని కొందరు రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట