జగన్ సత్తా తెలిసి కూడా మోడీ ఇలా చేశాడా ..? మూల్యం చెల్లించుకోవాల్సిందే..?

modi jagan

 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించి ముఖ్యమంత్రి అయినా జగన్ ప్రతి క్షణం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాడు. అయితే రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాల్లో జగన్ సర్కార్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ సర్కార్ కు విషమ పరిస్థితి తలెత్తింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ల పునస్సమీక్ష , రీ టెండర్ల పేరిట టీడీపీ నిర్ణయాలను తిరగ దోడేందుకు శ్రీకారం చుట్టింది.

polavaram

 అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొట్టేశారని నిరూపించడమే ఈ రీ టెండర్ల లక్ష్యం. అదే విధంగా పోలవరం విషయం లోనూ కొంత మిగులు చూపించారు. టీడీపీ హయాం లో నిర్మాణానికి 25 వేల కోట్లు, పునరావాసానికి 33 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. వైసిపి దీనిని మొత్తం గా 50 వేల కోట్ల లోపు నకు సవరించింది. ఇక్కడేదో టీడీపీ నేతలు దోచుకున్నారని బయటపెట్టాలని ఆత్రంతో జగన్ సర్కార్ చేసిన పని ఇప్పుడు వాళ్ళ మెడకే చుట్టుకుంది.. దీనిని సాకు గా తీసుకుంటూ కేంద్రం లో ని ఆర్ధిక శాఖ మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని చర్చకు పెట్టింది. 2014 నాటి అంచనా వ్యయాన్ని మాత్రమే ఇస్తామంటూ మెలిక పెట్టింది. ఈ నిర్ణయం పై కేంద్రం వెనక్కి తగ్గక పొతే పోలవరానికి శరాఘాతమే. మొత్తం వ్యయం లో 25 వేల కోట్ల పై చిలుకు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది.

 ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక స్థితిలో అది సాధ్యం కాదు. 2014 లో జాతీయ హోదా ఇచ్చి తాము నిర్మించాల్సిన ప్రాజెక్ట్ ను రాష్ట్రం చేపట్టింది కాబట్టి పెరిగిన వ్యయం తో తమకు సంబంధం లేదని కేంద్రం బుకాయిస్తోంది. ఇందులో టీడీపీ తప్పు కూడా లేకపోలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ క్రెడిట్ బీజేపీ ఖాతాలోకి వెళ్తుందని భావించిన చంద్రబాబు జాతీయ ప్రాజెక్టు అయినా పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నాడు. ఇదే సమయంలో పోలవరాన్ని ఒక ఆర్థిక వనరు గా చూశారు . దీనికంటే ముఖ్యం గా పొలిటికల్ మైలేజ్ ని బాబు ఆశించారు. కేంద్రం లో మిత్ర పక్షంగా ఉండటంతో బీజేపీ సైతం సహకరించింది. కానీ పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో టీడీపీ వైఫల్యం చెందింది.

polavaram 2

 ఇక ప్రస్తుతానికి వస్తే బీజేపీ పెట్టిన తిరకాసు వెనుక మరో బలమైన కారణం ఉందని తెలుస్తుంది. జాతీయం గా ఒకరొకరు గా మిత్రులను కోల్పోతున్న బీజేపీ దక్షిణాదిన బలమైన కొత్త పొత్తు కోసం ఎదురు చూస్తోంది. వైసిపి ని కలుపుకొనేందుకు ప్రయత్నిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే తన ఓటు బ్యాంక్ కి పూర్తీ భిన్నమైన బీజేపీ తో సైద్ధాంతికంగా కలవడం జగన్ కు ఇష్టం లేదు. అన్ని విషయాల లో ను కేంద్రానికి మద్దతు ఇస్తోంది వైసిపి . కానీ పొత్తు కు మాత్రం సుముఖంగా లేదు.

 దీనితో సీఎం జగన్ ను ఎలాగోలా లొంగదీసుకోవటానికి పోలవరంతో ముడిపెడితే పని జరుగుతుందని బీజేపీ అగ్ర నేతలు అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోలవరం పూర్తి చేయకుండా వచ్చే ఎన్నికలకు జగన్ వెళ్లలేని పరిస్థితి. పోలవరం పూర్తికావాలంటే బీజేపీ మద్దతు తప్పనిసరి, అలాగని బీజేపీతో కలిస్తే జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది… మరి ఈ విషమ పరిస్థితి నుండి సీఎం జగన్ ఎలా బయటపడుతాడో చూడాలి