పెళ్లికి ముందే మీనాకు భర్త అలాంటి కండిషన్లు పెట్టారా.. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యారా?

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి అగ్రతారగా పేరు సంపాదించుకున్నారు. ఈ విధంగా మీనా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే పూర్తిగా సినీ ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్నారు. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే మీనా తల్లి ఇష్ట ప్రకారమే మీనా విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుందనే వార్తలు వచ్చాయి.

ఇక పెళ్లి తర్వాత మీనా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు ఈ క్రమంలోనే పెళ్లికి ముందే మీనా భర్త తనకు ఎన్నో కండిషన్లు పెట్టారని అందుకే తాను ఇండస్ట్రీకి దూరమయ్యారనే వార్తలు వినిపించాయి. ఈ విధంగా మీనా గురించి వార్తలు రావడంతో ఒకానొక ఇంటర్వ్యూలో ఈ వార్తలపై మీనా స్పందిస్తూ తనకు ఎవరు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని వెల్లడించారు. తన గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమేనని కొట్టి పారేశారు. పెళ్లికి ముందే విద్యాసాగర్ తనకు బాగా పరిచయమని, తామిద్దరం మంచి స్నేహితులమని మీనా వెల్లడించారు.

పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కొంత సమయం పాటు తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడపాలని భావిస్తారు అలాగే పాప పుట్టిన తర్వాత తన పూర్తి సమయం పాపతో గడపడానికి సరిపోయిందని అందుకే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని మీనా వెల్లడించారు. ఇకపోతే ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలోనే తన భర్త మృతి చెందారు. తన భర్త ప్రోత్సాహంతోనే తిరిగి తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించామని మీన గతంలో వెల్లడించారు.అయితే ప్రస్తుతం ఈమె భర్త మృతి చెందడంతో ఇకపై తాను సినిమాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారని పూర్తిగా తన కూతురితో తన జీవితాన్ని గడుపుతూ తనకు తండ్రి లేరనే లోటు తెలియకుండా పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.