కేసీఆర్ విషయంలో జగన్ తప్పు చేశాడా..?

jagan telugu rajyam

 తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు అనే విషయం అందరికి తెలుసు. ఆంధ్ర లో చంద్రబాబు రాజకీయాల నుండి ఎలా తప్పించుకోవాలో, ఎలాంటి ఎత్తుగడలు వేయాలో కూడా జగన్ కి కేసీఆర్ సలహాలు ఇచ్చాడనే మాటలు కూడా వినవచ్చాయి. జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసే రోజు స్వయంగా వెళ్లి, బేసిన్లు లేవు, బేషజాలు లేవు అంటూ మాట్లాడిన  కేసీఆర్ తోనే నేడు జలలొల్లి పెట్టుకోవాల్సి వచ్చింది.

jagan kcr telugu rajyam

 

  కేసీఆర్ తో ఉన్న అనుబంధంతోనే మొన్నటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ అతిధిగా వెళ్ళాడు. ఆ సమయంలోనే ప్రతిపక్షాలు దీనిపై మాట్లాడుతూ కాళేశ్వరం అక్రమం అని దాని వలన ఆంధ్రాకి ఇబ్బంది కలుగుతుంది. అలాంటి కార్యక్రమానికి ఎలా వెళ్తావు అని అడిగిన సీఎం జగన్ లెక్కపెట్టకుండా వెళ్ళాడు. ఇప్పుడు అదే వాదనను కేసీఆర్ తనకి అనుకూలంగా మలుచుకొని మాట్లాడుతూ, కాళేశ్వరం అక్రమం అని ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు వాదిస్తుంది, అలాంటి అక్రమ ప్రాజెక్టు ప్రారంభించటానికి సీఎం జగన్ ఎందుకు వచ్చాడంటూ కేసీఆర్ లాజిక్ ప్రశ్న అడుగుతున్నాడు. దానికి ఏపీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. నిజానికి కేసీఆర్ పక్క రాష్ట్రాలతో నీటి విషయంలో పెద్దగా గొడవలు పెట్టుకోకుండా సామరస్యంగా వెళ్తుంటాడు.

  మహారాష్ట్ర తో సఖ్యత నెరపి కాళేశ్వరం ప్రాజెక్టు కు ఎలాంటి అడ్డంకులు రాకుండా పూర్తీ చేయగలిగాడు. అలాగే కర్ణాటకతో కూడా నీళ్ల విషయంలో వివాదాలు లేకుండా బాగానే వున్నాడు, కానీ ఆంధ్ర విషయానికి వచ్చేసరికి లెక్కలు తారుమారు అయ్యాయి. కాళేశ్వరానికి మద్దతు తెలిపితే రేపొద్దున కేసీఆర్ మద్దతు తనకి ఉంటుందని జగన్ అలోచించి ఉండవచ్చు, కానీ కేసీఆర్ విషయంలో అలాంటివి పనికిరావు. ఏది ఎప్పుడు అవసరమే అంత వరకే కేసీఆర్ ఎవరితోనైనా స్నేహం చేస్తాడు. ఏమైనా తేడాలు వస్తే నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తాడు. ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆ విషయం బాగానే అవగతం అవుతుంది. ఈ మధ్య కేసీఆర్ మాట్లాడుతూ శ్రీశైలం బాధ్యతలను కూడా మాకే అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాదిస్తామని చెప్పటం చూస్తుంటే జల వివాదం విషయంలో కేసీఆర్ ఎలాంటి వైఖరితో ఉన్నాడో తెలుస్తుంది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు వుంది ప్రస్తుత పరిస్థితి . మరి ఈ విషయంలో కేసీఆర్ ను జగన్ ఎంత వరకు బుజ్జగించి ఎలాంటి వివాదాలు లేకుండా తాను చేపట్టిన ప్రాజెక్ట్స్ పూర్తి చేసి, జల వివాదం పరిష్కరిస్తాడో చూడాలి.