ఆ హీరో వల్ల దాసరికి మెగాస్టార్ చిరంజీవికి గొడవలు అయ్యాయా?

సాధారణంగా ఏ పరిశ్రమలో అయినా పోటీ అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే సినీ పరిశ్రమలో కూడా హీరోల మద్య కూడా పోటీ ఉంటుంది. ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు తీసేవారు వారి తర్వాత బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి వారు సినిమాల విషయంలో ఒకరితో ఒకరు పోటీపడేవారు. అయితే ఆ రోజుల్లో అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రముఖ హీరోతో పోటి ఉండేది. అంతేకాకుండా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుతో కూడా చిరంజీవికి మనస్పర్ధలు ఉన్నాయని సమాచారం. దాసరి నారాయణరావు దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు పొందాడు.

చాలా కాలం తర్వాత సూరిగాడు సినిమాతో దాసరి నారాయణరావు హిట్ అందుకున్నాడు. ఆ క్రమంలో ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే అప్పటికే చిరంజీవికి దాసరి నారాయణరావుకి మధ్య మాటలో లేవని అందరికీ తెలుసు. దీంతో ఆ ప్రెస్ మీట్ కి వచ్చిన విలేకరులు దాసరి నారాయణరావుని కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న హీరోలలో స్టార్ హీరో ఎవరు అని అడగ్గా చిరంజీవి పేరు చెప్పాల్సి వస్తుందని దాసరి నారాయణరావు ఆ ప్రశ్నను దాటేశాడు. ఆ సమయంలో మీకు మోహన్ బాబు అంటే ఇష్టం కాబట్టి నేటి హీరోల గురించి మాట్లాడటానికి భయపడుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. నాకు ఏ హీరో అన్న భయం లేదు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలతో హిట్టు కొట్టిన దర్శకుడిని.. వారితో పోల్చుకుంటే ఇప్పుడున్న హీరోలందరూ చిన్నవాళ్లే అంటూ సమాధానం ఇచ్చాడు.

ఎవరు ఏమనుకున్నా ప్రస్తుతం ఉన్న హీరోలలో చిరంజీవి స్టార్ హీరో. కథ కన్నా చిరంజీవి పోస్టర్ చూసి సినిమాకి వచ్చే ప్రేక్షకులు ఎక్కువమంది ఉన్నారు అని చెబుతూ మరో మెలిక పెట్టాడు. స్టార్ హీరో కన్నా ఆర్టిస్ట్ ఎప్పుడూ గొప్పవాడే. హీరో కన్నా ఆర్టిస్ట్ ఎప్పుడూ ఒక మెట్టు పైన ఉంటాడు. తర్వాత మోహన్ బాబు గురించి మాట్లాడుతు.. మోహన్ బాబు ఒక మహా నటుడు. ప్రస్తుతం ఉన్న హీరోలలో డైలాగులు చెప్పటంలో మోహన్ బాబు తర్వాతే ఎవరైనా అని మోహన్ బాబుని మెచ్చుకున్నాడు. ఇలా ఈ ప్రెస్ మీట్ లో దాసరి నారాయణరావు చిరంజీవిని స్టార్ హీరో అని చెబుతూనే చిరంజీవి కన్నా మోహన్ బాబు ఒక గొప్ప నటుడు అని ప్రశంసలు కురిపించాడు. ఇలా మరొకసారి మోహన్ బాబు మీద ఉన్న ఇష్టాన్ని దాసరి నారాయణరావు ఇలా వెల్లడించాడు.