కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా తనయుడైన ధనుష్ 2002 లో ‘తుళ్లువాదో ఇలమై’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ అవటంతో ధనుష్ కి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత ధనుష్ నటించిన వడచెన్నై, అసురన్,3, మర్యన్, అనేకన్, కోడి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ధనుష్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే ధనుష్ ఇలా స్టార్ హీరోగా గుర్తింపు పొందటానికి ముందు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. జీవితంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి ధనుష్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ మాట్లాడుతూ..2003లో కాదల్ కొందెన్ సినిమా షూటింగ్ సమయంలో కొందరు సెట్స్‌లోనే తనను ఎగతాళి చేస్తూ మాట్లాడాలని ధనుష్ స్వయంగా వెల్లడించాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ధనుష్ దగ్గరికి వచ్చి ఇక్కడ హీరో ఎవరు ? అని అడిగారట . అప్పుడు ధనుష్ వేరే వ్యక్తిని చూపించాడు. అయితే ఆ వ్యక్తి ధనుష్ ని చూపించి అతడే హీరో అని చెప్పాడట. అయితే ధనుష్ హీరో అని తెలిసి ఆ వ్యక్తులు పడి పడి నవ్వుకొని ఆటో డ్రైవర్ లా ఉన్నాడు వీడు హీరో ఏంట్రా ?అని ధనుష్ ని ఎగతాళి చేశారట. అయితే ఇలా వారి హేళనను తట్టుకోలేకపోయిన ధనుష్ తన కార్ లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేశాడట. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా చెప్పుకొచ్చాడు.
అయితే అప్పుడు ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాటలకు బాధపడిన ధనుష్ తనకి తాను సర్ది చెప్పుకొని ఒక ఆటో డ్రైవర్ హీరో కాకూడదా అని ఎంతో కష్టపడి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ధనుష్ ఇలా హీరోగా తమిళ ప్రేక్షకులకే మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. ధనుష్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ప్రస్తుతం ధనుష్ ‘ద గ్రే మ్యాన్’ సినిమా తో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు ధనుష్ ని చూసి ఎగతాళి చేసిన వారికి ధనుష్ తన ఎదుగుదలతో సమధానం చెప్పాడు.