సుడిగాలి సుదీర్ కు ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా.. సుధీర్ పై ధనరాజ్ షాకింగ్ కామెంట్స్!

సుడిగాలి సుదీర్ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సుధీర్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైన సుధీర్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా వెండితెర అవకాశాలను అందుకొని హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఇలా బుల్లితెర నుంచి వెండితెర హీరోగా అంచెలంచెలుగా ఎదిగిన సుడిగాలి సుధీర్ గురించి ధనాధన్ ధన్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనరాజ్ సుధీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సుధీర్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించారని చిన్న వయసులోనే తన కుటుంబ భారాన్ని తన భుజాలపై మోసారని ధనరాజ్ ఈ సందర్భంగా తెలిపారు.ఇక మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నటువంటి సుధీర్ కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో తన టీమ్ లో పని చేశారని తెలిపారు. అయితే కెరీర్ మొదట్లో తాను ప్రతి ఒక్కరితో ఎంతో మర్యాదగా గౌరవంగా నడుచుకునే వారు.అయితే ప్రస్తుతం ఈయన ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ అదే గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరిని పలకరిస్తారని ధనరాజ్ వెల్లడించారు.

ఇలా అందరితోనూ గౌరవంగా ఉండటం వల్లే అతనికి అంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు ధనరాజ్ వెల్లడించారు. ఇకపోతే సుధీర్ స్కిట్ లో భాగంగా ఎంతో మంది అమ్మాయిలతో సరదాగా స్కిట్ చేస్తూ ఉంటారు.కానీ నిజజీవితంలో సుధీర్ వ్యక్తిత్వం అది కాదు సుధీర్ అసలు పార్టీలకు కూడా అటెండ్ కారు. రాత్రి 9 అయితేనే అతని ఫోన్ కూడా పని చేయదని ధనరాజ్ వెల్లడించారు.ఇక ప్రస్తుతం ఇలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ సుధీర్ తన పై అందరి చేత పంచ్ డైలాగులు వేయించుకుంటూ వుంటారు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ కి ఆ అవసరం లేదని ధనరాజ్ సుధీర్ గురించి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.