Devineni Uma: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల బంగారుపాల్యం మామిడి రైతులను పరామర్శించడం కోసం వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన పట్ల తెలుగుదేశం పార్టీ మంత్రులు మాజీ మంత్రులు ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రైతుల పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతున్నారని ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలని తెలిపారు.. ముందుగా వేసిన పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి రాకకు ముందే ట్రాక్టర్లను నిండా మామిడి పండ్లను నింపి ఆయన వస్తున్నప్పుడు రైతులు మద్దతు ధర లేక రోడ్లపై పడేసినట్లు వైసిపికి చెందిన వారిచేతే రక్తి కట్టించారు. తన స్వార్థం కోసం రైతులను అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికే పెద్ద ద్రోహం చేస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు కేజీ మామిడి పండ్లకు నాలుగు రూపాయల మద్దతు ధర తెలుపుతున్నారు. గతంలో రెండు రూపాయలు మాత్రమే ఉండేది ఆ సమయంలో ఎందుకని జగన్ మాట్లాడలేదని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్యాలెస్ లో నిద్రపోతున్నావా? ఐదు సంవత్సరాలపాటు ఏం గాడిదలు కాసావు అంటూ జగన్మోహన్ రెడ్డికి తనదైన స్టైల్ లోనే దేవినేని ఉమా కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌కు వచ్చింది.. రప్పా రప్పా గంజాయి బ్యాచ్‌తో జిందాబాద్‌లు కొట్టించుకోవడానికా? అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా నిలదీశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌తో డ్రామా.. సత్తెనపల్లిలో బెట్టింగ్ బ్యాచ్‌తో సింగయ్యను పొట్టన పెట్టుకున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
