shivratri: వేములవాడకు భక్తుల తాకిడి.. పూజ కార్యక్రమ వివరాలివే..

మహా శివరాత్రి పర్వాదినాన్ని పురస్కరించుకొని.. తెలుగు రాష్ట్రల్లో దేవలయాలు ముస్తాబయ్యాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. భారీగా తరలి వచ్చిన భక్తులు నిరంతర లఘు దర్శనం, కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. . ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి. 4 గంటల నుంచి 4.25 గంటల వరకు వరకు సుప్రభాతం, 4. 25 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతః కాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉదయం 7 గంటలకు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు కల్యాణ మండపంలో వైభవంగా మహాలింగార్చన జరుగుతుంది. రాత్రి 11.35 నిమిషాలకు ఏకాదశ రుద్రాభిషేకం జరుగనున్నది.