Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉంది అంటూ జనసేన నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందని తెలుస్తుంది. ఇటీవల ఆయన గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక నకిలీ ఐపీఎస్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే ఆయనతో అధికారులందరూ ఫోటోలు దిగారు అయితే చివరికి ఆయన నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని తెలియడంతో ఒక్కసారిగా జనసైనికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా పవన్ కళ్యాణ్ పర్యటనలో అంతమంది బందోబస్తు ఉన్న నేపథ్యంలో ఫేక్ ఐపీఎస్ రావడంతో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని అందరు అనుమానాలు వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆయన నుంచి పలుమార్లు బెదిరి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ కు ప్రమాదం ఉందని అభిమానులు ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే తాజాగా మరోసారి మంగళగిరిలోనే జనసేన పార్టీ కార్యాలయం పై దాదాపు 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగరడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మధ్యాహ్నం 1:30 నిమిషాల నుంచి 1:50 నిమిషాల వరకు జనసేన పార్టీ కార్యాలయం పై అనుమానాస్పదంగా డ్రోన్ చక్కెరలు కొట్టడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనుమానాస్పదంగా డ్రోన్లు ఎగరడంతో వెంటనే ఈ విషయాన్ని డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు మరింత సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి జనసేన పార్టీ కార్యాలయం పై అనుమానాస్పదంగా తిరిగిన ఆ డ్రోన్ ఎవరూ పంపించారు ఏంటి అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.