ఆంధ్రప్రదేశ్ పోలవరం విషయం ఇప్పుడు పూర్తిగా రాజకీయ టర్న్ తీసుకుంది. మొదట పోలవరం నెపం టీడీపీ వైసీపీ మీద, వైసీపీ టీడీపీ మీద వేసుకుంటూ రాజకీయాలు చేస్తే, ఇప్పుడు టీడీపీ ప్లేస్ లో బీజేపీ వచ్చి చేరింది. పోలవరం ఇష్యూ ఇప్పుడు బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు మారిపోతుంది. దీనితో ఇరు పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకున్నట్లు కనిపిస్తుంది.
గతంలో బీజేపీ కేవలం టీడీపీ పార్టీనే విమర్శిస్తూ రాజకీయం చేసేది, కానీ నేడు బీజేపీ డైరెక్ట్ గా వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తాజాగా బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ముక్కుకు కాదు కంటికి మాస్కు వేసుకున్నారు అని సునీల్ దేవధర్ ఆరోపించారు. టీడీపీ పోయి, వైసీపీ వచ్చాక పెనం నుంచి పోయిలోకి పోయినట్టు ఉంది అని అన్నారు.
కరోనా వారియర్స్ కు ఇచ్చేందుకు జగన్ సర్కార్ దగ్గర డబ్బులేదు, ఇమామ్ లకు, ఫాస్టర్ లకు ఇవ్వటానికి ఉందా అని నిలదీశారు. బీజేపీ లో ఇతర పార్టీ నేతలు ఎంత త్వరగా చేరితే, అంత త్వరగా వారికి ఉపయోగం ఉంటుందన్నారు. పురందేశ్వరి ఒకప్పుడు చిన్నమ్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఇప్పుడు పెద్దమ్మ అని అని అన్నారు . బాహుబలి ఎన్టీఆర్, కట్టప్ప చంద్రబాబు అంటూ మాట్లాడాడు.
బీజేపీ పార్టీ చంద్రబాబు మీద విమర్శలు చేయటం ఈ మధ్య కాలంలో సహజమే కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అయితే జగన్ మీద చేసిన విమర్శలు గురించి లోటుగానే ఆలోచించాల్సి వస్తుంది. ఒకరి మీద ఒకరు డైరెక్ట్ గా విమర్శలు చేసుకునే విషయంలో బీజేపీనే ఒక అడుగు ముందుకేసి జగన్ ను టార్గట్ చేసింది, ఇక ఇప్పుడు వైసీపీ వంతు వచ్చినట్లే మరి బీజేపీ నేతల కామెంట్స్ కు వైసీపీ తరుపు నుండి ఎలాంటి కౌంటర్ అటాక్స్ జరుగుతాయో చూడాలి.