Deepika Padukone: 35 రోజులకు 25 కోట్లు… ఆశ కైనా కొంచెం హద్దు ఉండాలి కదా దీపిక?

Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి దీపికా పదుకొనే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు. అయితే ఈ సినిమా కోసం ఈమె పెట్టిన కండిషన్లు నచ్చని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈమెను సినిమా నుంచి తప్పించి అనంతరం ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాల కోసం దీపికా పదుకొనే పెట్టిన కండిషన్లు విషయానికి వస్తే తనకు చిన్న పాప ఉన్న నేపథ్యంలో 8 గంటల పాటు షిఫ్ట్ పని చేయనని కేవలం 6 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పినప్పటికీ సందీప్ రెడ్డి ఒప్పుకోలేదని అందుకే ఆమెను తప్పించారంటూ వార్తలు వచ్చాయి. ఇలా సినిమా నుంచి దీపికను తప్పించడంతో ఆమె తన సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసింది అంటూ సందీప్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. ఇలా ఈ వివాదంపై ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ దీపికా పదుకొనేకు మద్దతు తెలిపారు.

ఇకపోతే తాజాగా ఈ వివాదం గురించి మరొక వార్త వెలుగులోకి వచ్చింది అసలు దీపిక పదుకొనే సందీప్ రెడ్డి మధ్య గొడవ 8 గంటల షిఫ్ట్ కాదని, రెమ్యూనరేషన్ పరంగా విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా కోసం దీపికా పదుకొనే షూటింగ్లో దాదాపు 35 రోజులపాటు పాల్గొంటుందని తెలుస్తోంది. ఈ 35 రోజుల కోసం ఈమె ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటమే కాకుండా ఈ సినిమా లాభాలలో 10% లాభాలను కూడా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారట. ఇలా దీపిక పదుకొనే డిమాండ్స్ నచ్చని సందీప్ రెడ్డి ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 35 రోజులకు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మరి 10% లాభాలు అడగడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.