David Warner: డేవిడ్ వార్నర్ పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తెలుగువారికి కూడా ఎంతో సుపరిచితమే. డేవిడ్ వార్నర్ కు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సుదీర్ఘమైనటువంటి ఆటను ఆడిన ఈయన ఆ సమయంలోనే తెలుగు సినిమాలకు రీల్స్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్వాగ్‌ను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలను ఇమిటేట్ చేయడమే కాకుండా ఎన్నో పాటలకు రీల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేశారు. ఇలా సినిమాలో పాటలకు రీల్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేసిన డేవిడ్ వార్నర్ ఏకంగా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్వరలోనే నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో ఈయన ఒక కీలక పాత్రలో నటించారని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఈయన పోస్టులు పోస్టర్ విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈయన సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డేవిడ్ వార్నర్ ఈ సినిమా కోసం నాలుగు రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నారని తెలుస్తోంది.
ఇలా నాలుగు రోజులకు గాను ఈయనకు ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారట అంతేకాకుండా ప్రమోషన్లకు కూడా అదనంగా మరో కోటి రూపాయలు ఇచ్చారని తెలుస్తుంది. ఇలా నాలుగు రోజుల షూటింగ్ కోసం డేవిడ్ వార్నర్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. టాలీవుడ్ లో పలువురు హీరోలు ఇప్పటికే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదని చెప్పాలి.