David Warner: ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.bఈయన క్రికెట్ రంగంలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తెలుగు సినిమాలకు రీల్స్ చేస్తూ డేవిడ్ వార్నర్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పుష్పా సినిమాకి సంబంధించిన ఎన్నో రీల్స్ చేస్తూ ఈయన వార్తలలో నిలిచారు.
ఇలా అల్లు అర్జున్ అభిమానులకు కూడా డేవిడ్ వార్నర్ ఫేవరెట్ గా మారిపోయారు. ఇలా పెద్ద ఎత్తున తెలుగు సినిమాకు సంబంధించిన రీల్స్ చేస్తూ ఎంటర్టైన్ చేసి ఏకంగా తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డేవిడ్ వార్నర్ త్వరలోనే నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో రాబోతున్న రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో డేవిడ్ వార్నర్ నటించారని తెలియజేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరగడమే కాకుండా డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించారు అనే ఆతృత కూడా నెలకొంది.
ఇక డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో నటించినందుకు గాను ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో డేవిడ్ రెమ్యూనరేషన్ కోసం నటించలేదని ఆయనకు సినిమాలంటే ఆసక్తిగా ఉండటంతో సరదాగా నటించారని తెలుస్తోంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా 50 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
