Love Story: ఈ మధ్య కాలంలో యువత ప్రేమించకపోతే అదొక అవమానంగా భావిస్తున్నట్టు ఉన్నారు. చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి అంటూ చాలా మంది యువత మోసపోతున్నారు. తమ పిల్లలని ఎంతో గారాబంగా పెంచరు వారికి ఏ లోటూ లేకుండా క్ చూసుకున్న తల్లిదండ్రులను మోసం చేసి వారి ప్రేమించిన వారితో వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకు ఇది ఒక నరకంగా ఉంటుంది. బంధువులు చుట్టుపక్కల ఊళ్ళల్లో తమ పరువు పోయే నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరి ఏమైపోయినా పర్వాలేదు వారు కోరుకున్న వారితో కలిసి ఉంటే చాలు అంటూ ఇంటి నుండి పారిపోతున్నారు.
చిత్తూరు జిల్లా ,పెద్దపంజాణి మండలంలోని ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మండలంలోని ఒక గ్రామంలో 5 రోజుల క్రితం తమ కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయి కోసం ఆరా తీయగా తను ప్రేమించిన వ్యక్తితో మారిపోయిందని సమాచారం అందింది. పోలీసులు వారి ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి లోకేషన్ ఆధారంగా యువకుడిని గుర్తించి పోలీసులు ఫోన్ చేసి అతని బెదిరించారు. పోలీసులు ఫోన్ చేయటంతో భయపడిపోయిన సదరు వ్యక్తి గంగవరం పోలీస్ స్టేషన్లో హాజరయ్యాడు.
పోలీసులు ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. యువకుడితో వెళ్ళిపోయి తమ పరువు తీసింది అని అమ్మాయి తల్లిదండ్రులు ఆమెనీ ఇంటికి తీసుకెళ్ళమని తెగేసి చెప్పారు. మరొకవైపు అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని తమతోపాటు తీసుకెళ్లే ప్రసక్తి లేదని ఖచ్చితంగా చెప్పారు. ఇదిలా ఉండగా ఆ జంట ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్లనని అమ్మాయి చెప్పగా.. అబ్బాయి కూడా అదేరీతిలో అమ్మాయి తో ఉండటం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. పోలీసులు వారి తల్లిదండ్రులకు ఎంత సర్ది చెప్పినా ఎంతసేపటికీ ఈ విషయం సద్దుమణగలేదు. అందువల్ల అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు వారితో పాటు తీసుకెళ్లి కాకపోతే తహసీల్దార్ ముందు హాజరు చేస్తామని పోలీసులు వెల్లడించారు.