Kruthi Mahesh: ఆ డ్యాన్స్ కంపోజర్ కు క్రెడిట్ ఇవ్వకపోవడం నిజంగా దారుణం..?

Kruthi Mahesh: ఒకప్పటి సినిమాలతో పోల్చుకుంటే ఇప్పటి సినిమాలు, పాటలు మాటలు అన్నీ కూడా కలుషితమైపోయాయి. అప్పట్లో సినిమాల్లో పాటలు వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా, అలాగే పాటలోనే భావాలు మాటలు అర్థమయ్యే విధంగా ఉండేవి. కానీ ప్రస్తుతం రిలీజ్ అయ్యే సినిమా లోని పాటలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఒకప్పటి పాటలు ఇప్పటికీ కూడా ప్రేక్షకుల నోళ్ళలో మెదులుతూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం వస్తున్న పాటలు డ్యాన్సులు, బూతు మాటలు, హీరోయిన్ ల అంద ప్రదర్శనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జనాలకు వీనులవిందు కలిగించే పాటలు కనిపించకపోగా, రెచ్చగొట్టే పాటలు అధికమయ్యాయి. కానీ ప్రస్తుతం రిలీజ్ అయ్యే సినిమాలలో అలాంటి పాటలు ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా ఒక అద్భుతమైన పాట ఉంది. ఈ సినిమాలో ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి అనే పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు. అయితే ఆయన రాసిన చివరి పాట అదే అంటున్నారు సినీ ప్రేక్షకులు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించగా, మిక్కీజె మేయర్ చక్కటి సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ పాటకు సాయి పల్లవి వేసిన డాన్స్ అద్భుతం అని చెప్పవచ్చు. ఈ పాటను చూస్తున్నంత సేపు కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అయితే ఈ పాటను అంత మంచిగా కంపోజ్ చేసిన వారు ఎవరు అన్నది మాత్రం బయటకు తెలియలేదు. ఈ పాటను కంపోజ్ చేసిన వారు ఎవరు అని ఆరా తీయగా అద్భుతమైన పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన మాస్టర్ పేరు మా కుత్రి మహేష్ అని తెలిసింది. అయితే అటువంటి అద్భుతమైన పాటకు డాన్స్ కంపోజ్ చేసిన ఆ మాస్టర్ కు చిత్ర యూనిట్ క్రెడిట్ ఇవ్వక పోవడం దారుణం అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ పాటను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు ఈ పాటకు సంబంధించిన అన్ని వివరాలు పెట్టారు. కానీ ఆ పాటకు అంత అద్భుతంగా డాన్స్ కంపోజ్ చేసిన మాస్టర్ పేరు మాత్రం వెల్లడించలేదు.