టీడీపీ నేతల అరెస్ట్ ల తో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో జరుగుతోంది. టీడీపీ-వైకాపా నేతలు సవాల్ విసుకుంటూ రాజకీయాన్ని అంతకంతకు వేడెక్కిస్తున్నారు. జగన్ సర్కార్ పాత కక్షలు కారణంగానే అక్రమంగా కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ తో సీమలో సీన్ మరింత మండిపోతుంది. తాజాగా మరో టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డినే హెచ్చరించారు. టీడీపీలో యాక్టివ్ గా ఉన్నందుకే జగన్ తమని టార్గెట్ చేసారని ఆరోపించారు.
బాబాయ్ ని, తమ్ముడిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇది మర్చిపోం. ఈరోజు మీదు…రేపు మాది అవుతుంది. దెబ్బకు దెబ్బ తీస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా జరిగేది ప్రతీకారం తీర్చుకోవడమేనంటూ హెచ్చరించారు. అలాగే పవన్ రెడ్డిని ఇంటర్వూ చేసిన ఏబీఎయన్ యాంకర్ మీకు ఇంటర్వూ ఇచ్చినందుకు నన్ను కూడా వేధిస్తారేమో అంటు అన్నారు. దీన్ని బట్టి పచ్చ మీడియా జగన్ సర్కార్ పై ఏ స్థాయిలో విషo చిమ్ముతుందో మరోసారి స్పష్టమైంది. ఇటీవలే మేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు జగన్ విషయంలో ఎంత పాచియపోయిన పలుకు అయిందో! తెలిసిందే.
జర్నలిజం నైతిక విలువలు గాలికొదిలి ఇష్టాను సారం కథనాలు ప్రచురించడం…ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాయడం వంటి అంశాలు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాల వాసుల్లో తీవ్ర అసహనానికి తెర తేసింది. ఆ జిల్లాల్లో కొన్ని ప్రాంతీయ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. సినీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ కోసం విజయవాడ సీఎం ఆఫీస్ కు వస్తుంటే కరోనా టైమ్ లో ఇవేం పనులంటూ రాధాకృష్ణ కొత్త పలుకులో చెత్త పలుకుగా నిలిచింది. ఈ పలుక సహా గతంలో చాలాకథనాల్లో సదరు పత్రిక ఆ సామాజిక వర్గానికి ఎంతగా కొమ్ము కాస్తుందో? జగన్ ని ఏస్థాయిలో వ్యతిరేకిస్తుందో తేట తెల్లమైంది.