ఇదేం పాలన. ఓవైపు రాష్ట్రంలో దళితులపై రోజురోజుకూ దాడులు ఎక్కువవుతుంటే రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదా? అంటూ కొత్త పలుకు పలికిన చంద్రబాబుకు ఆ దళిత రాజకీయమే బెడిసికొట్టింది. దళిత శంఖారావం అంటూ దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కార్యక్రమం చేపట్టిన చంద్రబాబుకు.. అదే పెద్ద తలనొప్పి అయింది. దళిత రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేద్దామనుకున్న బాబే అడ్డంగా బుక్కయిపోయారు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు వైసీపీ నేతలే కారణం అంటూ చంద్రబాబు ఎప్పుడూ ఆరోపిస్తుంటారు. అలాగే తాజాగా చిత్తూరులో జరిగిన ఓ దాడి కూడా వైసీపీ నేతలే చేశారంటూ టీడీపీ తమ్ముళ్లు కోడైకూశారు. కానీ.. చివరి ఆ దాడి చేసింది టీడీపీ వాళ్లేనని తెలిసి ఏం చేయాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం టీడీపీలో నెలకొన్నట్టు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో ఓ దళిత వ్యక్తిపై దాడి జరిగింది. వెంటనే స్పందించిన చంద్రబాబు.. ఆ దాడి వెనుక వైసీపీ హస్తం ఉందని.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డీజీపీకి కూడా లేఖ రాశారు. ఏపీ టీడీపీ మొత్తం ఒకేసారి ప్రభుత్వం మీద ఎగిరిపడింది. దీంతో పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ జరపగా.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.
చిత్తూరు జిల్లాలో జరిగిన దాడికి కారణం టీడీపీ నేతలే అని పోలీసులు తేల్చినట్టు సమాచారం. దీంతో చంద్రబాబుకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదట. వైసీపీని ఎలాగైనా ఇరికించాలని చూస్తే నేనే ఇరుక్కున్నాను ఏంటి? అని తల పట్టుకున్నారట చంద్రబాబు.
ఏపీలో చీమ చిటుక్కుమన్నా.. అది వైసీపీ పనే అంటూ ఆరోపణలు చేసే చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు.. అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దళితులకు ముమ్మాటి ద్రోహం చేస్తున్న పార్టీ టీడీపీనేని.. దీనిపై చంద్రబాబు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.