రోజురోజుకు మహిళలపై జరిగే అత్యాచారాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి.మహిళలపై జరిగే అత్యాచారాలు, లైంగిక దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కుడా కామాంధులకు సరైన అడ్డుకట్ట వేయలేకపోతుండడంతో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా వావి వరసలు మరచి మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూలీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.
కూలి పేరుమీద మహిళలను వెంట తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. ఇలా తాజాగా కూలీకి వెళ్లిన మహిళ శవంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన అనిత పట్టణంలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేంది. రోజు లాగే ఆమె గత నెల 15వ తేదీన ఇంటి నుండి బయలు దేరి వెళ్లింది.ఆరోజు వెళ్లిన ఆమె ఆచూకి లభించకుండా పోయింది. తిరిగి ఇంటికి వస్తుందని కొద్ది రోజులుగా ఎదురుచూసిన అప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.తాజాగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి దేవి విహార్ సమీపంలోని కంది చేనులో ఓ మహిళ శవం కుల్లిపోయిన స్థితిలో స్థానికులకు కనిపించింది.
దీంతో స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ ఎవరు అనే కోణంలో విచారించగా చివరకు గత నెలలో అదృశ్యమైన కామారెడ్డి మండలం క్యాసంపల్లి తాండకు చెందిన విస్లావత్ అనిత మృతదేహంగా గుర్తించారు. అనిత మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన ఉండడంతో సంఘటనా స్థలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించారు.స్థానిక రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు అనిత లింగంపేట మండలంకు చెందిన మేస్త్రి ప్రకాష్ తో అనితకు పరిచయం ఉండడంతో తరచు అయనతో కలిసి కూలి పనికి వెళ్లేదని తెలిపారు. ఇదే క్రమంలో గత నెల 15వ తేదీన ప్రకాష్ తో కలిసి వెళ్ళిందని చెప్పారు. కాగా అదే రోజు కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవుని పల్లి గ్రామ శివారులొని కంది చేను వద్ద డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు..ఆ రోజే హత్య చేసి ఉండవచ్చునని తెలిపారు. ప్రస్తుతం కాల్ డేటా ఆధారంగా ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.