Nara Lokesh: ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇటీవల మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమెకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు హోంమత్రి అనిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల సింహాచలం వెళ్ళినటువంటి ఈమె మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు హోం మంత్రి అనిత సమాధానం చెబుతూ.. మన నుదుటిపై రాసిపెట్టిన దాన్ని ఎవరు చెరపలేరని తెలిపారు ఆ దైవ నిర్ణయం ఉంటే కచ్చితంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని తెలిపారు. ఆయనకు ఆ పదవి రాసిపెట్టి ఉందేమో చూద్దాం అంటూ హోం మంత్రి అనిత ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడారు.
దైవ నిర్ణయం, స్వామి దయ వుంటే ఎవరికైన పదవులు లభిస్తాయని తెలిపారు. విశాఖ ఉక్కుకు మనుగడపై ప్రశ్నించేవారికి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ సమాధానం అన్నారు. ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఈ సందర్భంగా హోం మంత్రి తెలియ చేసారు. ఈ విధంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావడం గురించి అనిత చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాకుండా జనసేన నాయకులకు కార్యకర్తలకు ఒకింత షాక్ అని చెప్పాలి.
ఈమె నారా లోకేష్ కు రాసిపెట్టి ఉంటే జరుగుతుందని చెప్పడంతో కచ్చితంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు చంద్రబాబు నాయుడు కూడా బలంగా కోరుకుంటున్నారు అందుకే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మంత్రులందరూ కూడా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఈ కోరిక వెనుక చంద్రబాబు నాయుడు ప్రమేయం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు.
