Ntr: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడు అయినప్పటికీ కూడా నందమూరి కుటుంబం మాత్రం ఎప్పటికప్పుడు ఈయనని దూరం పెడుతూ వస్తున్నారు కుటుంబ కార్యక్రమాలలో కానీ ఇతర కార్యక్రమాలలో కూడా ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరిని కూడా పూర్తిస్థాయిలో దూరం పెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా తన మేనత్త పురందేశ్వరి ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా పురందేశ్వరి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తనకు మధ్య చాలా మంచి బంధం ఉందని తెలిపారు. ఒక అత్తగా నన్ను ఎంతగానో గౌరవిస్తాడని పురందేశ్వరి తెలిపారు.
ఇక మా అబ్బాయి ఎన్టీఆర్ చాలా క్లోజ్ అని తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారని ఈమె వెల్లడించారు.ఎన్టీఆర్ వ్యక్తిత్వం, వినయాన్ని ప్రశంసించిన పురందేశ్వరి, ఎప్పటికప్పుడు కుటుంబంతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని చెప్పారు. ఇక సినిమాల విషయంలో ఎన్టీఆర్ కి తాము ఎప్పుడు సలహాలు ఇవ్వమని, సినిమాలు విడుదల లేనప్పుడు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తామని తెలిపారు.
ఇక సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా సినిమా చూసి సినిమా గురించి మా అభిప్రాయాన్ని తెలియపరుస్తామని పురందరేశ్వరి వెల్లడించారు.ఎన్టీఆర్ ఏ తరహా పాత్ర పోషించినా ప్రభావవంతంగా నటిస్తాడని, నటనలో తనదైన ముద్ర వేయగల గొప్ప టాలెంట్ ఉన్న నటుడు అంటూ కొనియాడారు అలాగే ఆయన చేసే కుటుంబ కథ చిత్రాలు తనకు బాగా నచ్చుతాయని ఎన్టీఆర్ సినిమాలను ఒక మేనత్తల కాకుండా ఒక సాధారణ ప్రేక్షకురాలిగా మాత్రమే చూస్తూ ఎంజాయ్ చేస్తుంటానని పురందరేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి